జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిన్న తుని బహిరంగసభలో మాట్లాడుతూ చావనైనా చస్తాగానీ పార్టీని మాత్రం వేరే ఏ పార్టీలోనూ విలీనం చెయ్యను అని ప్రకటించారు. పవన్ కళ్యాణ్ పార్టీకి అంత సీన్ లేదని, 2019 ఎన్నికలయ్యాక కచ్చితంగా ఆయన ఏదో ఒక పార్టీలో విలీనం చెయ్యడం ఖాయమని ప్రత్యర్థుల విమర్శ.
[m9ad]
చిరంజీవి, ప్రజారాజ్యం అనుభవాల దృష్ట్యా ప్రజలలో కూడా ఈ అనుమానం లేకపోలేదు. దానితో పవన్ కళ్యాణ్ తరచుగా దీనిమీద క్లారిటీ ఇస్తూ పోతున్నారు. అయితే పదే పదే ఇలా చెప్పడం చిరంజీవికి ఇబ్బందిగా ఉంటుందంట. ప్రజలు మర్చిపోయిన విషయాన్ని పెద్దది చేసి పదే పదే ప్రస్తావించడం వల్ల చిరంజీవిని చులకన చేసినట్టు చేస్తున్నారు.
చిరంజీవి సంగతి ఎలా ఉన్న అభిమానం పరంగా కులం పరంగా ఆయనను అభిమానించే వారికి ఇది మరీ ఇబ్బందిగా ఉంటుందట. అయితే కొందరు మాత్రం జనసేన రాజకీయంగా సక్సెస్ కావాలంటే ఇది తప్పదని, తాను ప్రజారాజ్యం పార్టీలా కాదని నిరూపిస్తే తప్ప సామాన్య ప్రజలు జనసేన వైపు చూడరని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.



