లేనిపోని తిప్పలు కొని తెచ్చుకున్న బాలయ్య… కేసీఆర్ కన్నెర్రచేస్తారా?

Will KCR take revenge on Nandamuri Balakrishnaతెలంగాణ ఎన్నికల సమరంలో కేసీఆర్ మరోసారి విజేతగా నిలిచారు. యావత్ తెలంగాణ సమాజం ఆయనకు అండగా నిలిచి 88 సీట్లతో ఉద్యమ నీరాజనం పలికారు. మహాకూటమిలోని పార్టీలు కేవలం 21 సీట్లతో సరిపెట్టుకున్నాయి. కాంగ్రెస్ కు 19 సీట్లు రాగా టీడీపీకి రెండంటే రెండే వచ్చాయి. కోదండ రామ్ పార్టీ పోటీ చేసిన ఎనిమిది స్థానాలలో ఏడు చోట్ల డిపాసిట్లు కోల్పోయింది. సిపిఐ మూడు చోట్ల పోటీ చేస్తే ఒక్క చోట డిపాజిట్ రాలేదు. ఆ రెండు పార్టీలు తమ ఖాతా తెరవలేదు.

ADVERTISEMENT

[m9ad]

అయితే ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రచారంలో మహాకూటమి నేతలంతా శక్తి వంచన లేకుండా కృషి చేశారు. టీడీపీ తరపున సినీ నటుడు బాలకృష్ణ స్టార్ క్యాంపెయినర్ గా ప్రచారం చేశారు. అయితే అది పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. అయితే దీని వల్ల బాలయ్యకు నష్టాలు కూడా చాలానే ఉన్నాయట. ప్రచారం సందర్భంగా కేసీఆర్ పై బాలయ్య సంధించిన పంచ్ డైలాగులు గట్టిగానే తగిలాయట గులాబీ దళపతికి. దీనితో బాలయ్యకు కొన్ని తిప్పలు తప్పవని సమాచారం.

గతంలో బాలయ్య గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా ముహూర్తం షాట్ కు కేసీఆర్ ముఖ్య అతిధిగా వచ్చారు. ఆ సినిమాకు పన్ను మినహాయింపు కూడా ఇచ్చారు. అలాగే స్పెషల్ షోలు వేసుకోవడానికి పర్మిషన్ కూడా ఇచ్చారు. అయితే ఇక ముందు బాలయ్య కు అటువంటివేమీ తెలంగాణాలో ఉండవు. ప్రస్తుతానికి బాలయ్య ఎన్టీఆర్ జీవిత చరిత్రను సినిమాగా తీస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్టీఆర్ వీరాభిమాని. తన కొడుకు కేటీఆర్ కు ఎన్టీఆర్ పేరు పెట్టుకున్నారు కూడా.

తనకు ఆయన మీద ఎంతో గౌరవం ఉందని పలు మార్లు చెప్పుకొచ్చారు ఆయన. బహుశా బాలయ్య తెరాసకు వ్యతిరేకంగా ప్రచారం చెయ్యకుండా ఉండి ఉంటే మరోసారి పన్ను మినహాయింపు ఇచ్చేవారేమో. ఇప్పుడు పన్ను మినహాయింపు, స్పెషల్ షోల మాట అటుంచి బాలయ్యకు తెలంగాణ ప్రభుత్వానికి కొత్త చిక్కులు రాకుండా ఉంటే అదే పది వేలు. రెండు భాగాలుగా సిద్ధం అవుతున్న ఎన్టీఆర్ జీవిత చరిత్ర జనవరిలో విడుదలకు సిద్ధం అవుతుంది. రెండు వారాల గ్యాప్ లో రెండు భాగాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.

ADVERTISEMENT
Latest Stories