ప్రిన్స్, రోజాకు అంత ఛాన్స్ ఇస్తాడా?

Minister Roja

మంత్రి రోజా మళ్ళీ సినిమాల మీద మనసు పడినట్టున్నారు. రాజకీయాలలో ఉన్నప్పటికీ జబర్దస్త్ వంటి డబల్ మీనింగ్ కామెడీ టీవీ షోలో జడ్జ్ గా వ్యవహరిస్తూ “జబర్దస్త్ రోజా” గా రెండు తెలుగు రాష్ట్రాలలో బాగా ఫేమస్ అయ్యారు. ఒక రకంగా 2019 ఎన్నికలలో రోజా గెలుపు పై ఈ షో ప్రభావం గట్టిగానే పనిచేసింది. అయితే జగన్ కేబినెట్లో మంత్రి పదవి రాగానే టీవీ షోకి వీడ్కోలు పలికిన రోజా ఇప్పుడు వెండి తెరకి ఆహ్వానం పలకాలి ఆశ పడుతున్నట్టున్నారు.

అయితే ఇక్కడ కూడా కండిషన్స్ అప్లై అంటూ కేవలం మహేష్ బాబు పక్కన మాత్రమే నటించడానికి ఆసక్తిగా ఉన్నానంటూ రోజా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అదికూడా ప్రిన్స్ మహేష్ బాబుకి అమ్మగా కాదంటూ వదినగానో,అక్కగానో చేయాలనీ ఆశపడుతున్నట్లు స్వయంగా రోజానే ప్రకటించడంతో ఇక సోషల్ మీడియాలో మీమర్స్ కు ఛాన్స్ వచ్చిందే పనిగా మీమ్స్ తో రెచ్చిపోతున్నారు.

ADVERTISEMENT

ఇంకా నైయం మహేష్ పక్కన హీరోహిన్ ఛాన్స్ అడగలేదు అంటూ ఒకరు, మహేష్ కు అక్కాకా కాదు చెల్లిగా చేయాలి అంటూ మరొకరు, వదినగా రోజా చేస్తే అన్నగా నాగబాబుని పెట్టాలని మరొకరు తమతమ క్రియేటివిటీలతో చెలరేగిపోయున్నారు.అయినా ఒక్కసారిగా రోజాకు మహేష్ ఎందుకు గుర్తొచ్చారో? వైసీపీ ప్రభుత్వం సినీ పరిశ్రమను, సినీరంగ ప్రముఖులను అవమానించినప్పుడు ఈ రోజా గారు ఏకూజాలో దాక్కున్నారో? అంటూ పంచ్ లు పేలుస్తున్నారు.

ప్రొద్దున్న లేస్తే జగన్ ప్రాపకం కోసం రాజకీయాలతో సంబంధం లేని వారిని కూడా రాజకీయాలకు ముడిపెట్టి రోజా చేసిన విమర్శలను జత చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు వెలుస్తున్నాయి. మంత్రి పదవి రాగానే చిరు ఇంటికివెళ్ళి ఆశీస్సులు తీసుకున్న రోజా ఎవరి మెప్పుకోసం అదే చిరంజీవిని కించపరిచిందో? కొన్నేళ్లుగా జబర్దస్త్ లో కలిసి పని చేసిన నాగబాబు ప్రవర్తన రోజాకు మంత్రి పదవి రాగానే ఎందుకు నచ్చకుండా పోయిందో?

సూపర్ స్టార్ రజనీకాంత్ పై చేసిన వ్యాఖ్యలు ఎవరి కళ్ళలో అనందం చూడడానికో? అంటూ రోజాపై ప్రశ్నల వర్షమే కురిపించారు. తాజాగా పవన్ తన ప్రతి రాజకీయ వేదికలలో సినీ పరిశ్రమలో అందరి హీరోలతో తనకు స్నేహ సంబంధాలు ఉన్నాయంటూ,మహేష్ బాబు, జూ.ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్,రవితేజ చిరంజీవి ఇలా అందరి హీరోల ఫాన్స్ తనకు మద్దతుగా ఉండాలంటూ, అందరి ఫాన్స్ కలిసికట్టుగా రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలంటూ ఇచ్చిన పిలుపుకి మంచి స్పందనే సంపాదించారు పవన్.

అందరి హీరోల ఫాన్స్ ఎక్కడ వైసీపీ పార్టీకి వ్యతిరేకమవుతారో అని భావించి రోజా మహేష్ మీద వైసీపీ ప్రేమ చూపిస్తున్నారంటూ కొందరు మహేష్ అభిమానులు భావిస్తున్నారు. అసలు రాజకీయాల స్పెల్లింగ్ కూడా తెలియదు అంటూ చెప్పుకొచ్చే ప్రిన్స్ మహేష్ బాబు ఇటువంటి వ్యాఖ్యలను పట్టించుకుంటరా? అంటే లేదనే చెప్పవచ్చు. అయితే అలా అని రోజా ఆశలు మహేష్ తీరుస్తారా? అంటే అది కూడా సందేహమే.

ప్రస్తుత పరిస్థితులలో రోజాకు మహేష్ అంత ఛాన్స్ ఇస్తారని అంటే సినీ పరిశ్రమ నుంచి లేదనే సమాధానమే వస్తుంది. ఎందుకంటే ఎంతటి హీరో అయినా వారి అభిమానుల ఇష్టాలకు అనుగుణంగానే నడుచుకుంటారు. కాబట్టి రోజా కల ఇప్పట్లో నెరవేరే అవకాశం కనిపించడం లేదనే చెప్పాలి.

ADVERTISEMENT
Latest Stories