ఫస్ట్ లుక్ పోస్టర్ అండ్ టీజర్ తో ఆసక్తిని కలిగించిన మంచు లక్ష్మీ “w/o రామ్” మూవీ ధియేటిరికల్ ట్రైలర్ తో మరో అడుగు ముందుకు వేసినట్లు కనపడుతోంది. ‘మంచు లక్ష్మి భర్త ఎలా మరణించాడు? దాని వెనుక ఉన్న మర్మం ఏమిటి?’ అనేదే చిత్ర ప్రధాన కధగా ట్రైలర్ మరోసారి స్పష్టం చేసింది.
ట్రైలర్ ను ఆసక్తికరంగా కట్ చేయడంలో చిత్ర యూనిట్ సక్సెస్ సాధించింది. స్టోరీ పాయింట్ ను రివీల్ చేసినప్పటికీ, ట్రైలర్ ను సరిగ్గా కట్ చేయడంతో ఆద్యంతం ఆకట్టుకునే విధంగా ఉంది. విజయ్ ఏలకంటి దర్శకత్వం వహించిన ఈ సినిమా అయినా మంచు లక్ష్మికి బ్రేక్ ఇచ్చేలా కనపడుతోంది.
ADVERTISEMENT
ADVERTISEMENT



