టాలీవుడ్ సినిమాలకు ప్రపంచ కప్పు దెబ్బ

ICC World Cup 2023మన దేశంలో కులమతాలతో సంబంధం లేకుండా జనం విపరీతంగా ఆరాదించేవి, ఇష్టపడేవి రెండే. ఒకటి సినిమా రెండు క్రికెట్. రంగాల పరంగా పూర్తి వైరుధ్యం ఉన్నా వీటి మధ్య ఉన్న అవినావ సంబంధాలను వేరు చేసి చూడలేం. అందుకే ధోని, సచిన్, అజారుద్దీన్, మిథాలీ రాజ్ లాంటి వాళ్ళ కథలు తెరమీదకొచ్చాయి. హర్భజన్ సింగ్, శ్రీశాంత్ లు మేకప్ వేసుకునేందుకు ప్రేరేపించాయి.

ఇక మన వెంకటేష్ వీలు దొరికినప్పుడంతా లైవ్ మ్యాచులు చూసేందుకు ఎంత దూరమైనా వెళ్ళిపోతారు. తారలు సరదాగా ఆడే స్పోర్ట్స్ లో క్రికెట్ దే ప్రధమ స్థానం. అక్టోబర్ లో ప్రపంచ కప్ మొదలుకాబోతోంది. అది కూడా మన దేశంలో. క్రేజ్ మాములుగా ఉండదు. కేవలం మ్యాచులు చూసేందుకే ఫ్లైట్లు, ట్రైన్లు ఎక్కి వెళ్లే అభిమానులు లక్షల్లో ఉంటారు. ఇక టీవీ లైవ్ గురించి చెప్పేదేముంది.

ADVERTISEMENT

ఐపీఎల్ టైంలోనే జియో యాప్ లో సగటున కోటి నుంచి రెండు కోట్ల దాకా వ్యూయర్ షిప్ రావడం చిన్న విషయం కాదు. అలాంటిది నాలుగేళ్లకోసారి వచ్చే అతి పెద్ద టోర్నీ అంటే కళ్ళు, కాళ్ళు ఆగుతాయా. నలభై అయిదు రోజుల పాటు సాగే ఈ క్రీడా సంరంభంలో హోమ్ గ్రౌండ్ కాబట్టి ఇండియా ఫైనల్ దాకా వెళ్లే అవకాశాలను అంత తేలిగ్గా కొట్టి పారేయలేం.

ఆ నెలలో దసరా పండగ ఉంది. బాలకృష్ణ భగవంత్ కేసరి, రవితేజ టైగర్ నాగేశ్వరరావు, విజయ్ లియో నువ్వా నేనాని పోటీకి సిద్ధమయ్యాయి. బాంగ్లాదేశ్, పాకిస్థాన్, న్యూ జిలాండ్, ఇంగ్లాండ్ తదితర జట్లతో మన మ్యాచులన్నీ విజయదశమికి ముందు వెనుకా ఉన్నాయి. మన క్రికెట్ లవర్స్ కేవలం ఇండియా ఆటలే చూడరు. క్రేజ్ ఉన్న ఇంట్రస్టింగ్ క్లాషులన్నీ టీవీలో ఎంజాయ్ చేస్తారు.

సహజంగానే థియేటర్లకు వెళ్లే మూడ్, టైం రెండూ ఉండవు. దీని ప్రభావం తీవ్రంగా నుంచి ఓ మోస్తరు దాకా బాక్సాఫీస్ మీద ఖచ్చితంగా పడుతుంది. అందుకే రామ్ బోయపాటిలు తెలివిగా పండగ బరి నుంచి తప్పుకుని సెప్టెంబర్ కు షిఫ్ట్ చేశారు. ఇదంతా దృష్టిలో పెట్టుకునే అక్టోబర్ మొదటి రెండు వారాలు ఆపై లాస్ట్ వీక్ చెప్పుకోదగ్గ పెద్ద సినిమాలేవీ షెడ్యూల్ చేసుకోలేదు.

నవంబర్ 19 ఫైనల్ ఉంటుంది. ఆ నెలలో ధనుష్ మిల్లర్, కార్తీ జపాన్ లు తప్ప ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన స్టార్ హీరోల సందడి ఉండకపోవచ్చు. ఈ పరిణామాలన్నీ గమనిస్తున్న అగ్ర నిర్మాతలు తొందరపడి ప్రకటనలు ఇవ్వకుండా సైలెంట్ గా షూటింగులు చేసుకుంటున్నారు. వరల్డ్ కప్ క్రేజ్ ఇప్పుడు కనిపించదు కానీ దగ్గర పడే కొద్దీ ఆ ఫీవర్ మెల్లగా పెరుగుతూ జనాలను ఇళ్లకు కట్టిపడేస్తుంది. ఎటొచ్చి గడ్డు పరిస్థితి ఎదురయ్యేది థియేటర్లకే.

ADVERTISEMENT
Latest Stories