చంద్రబాబు మహిమ! అమరావతిలో డబ్ల్యూటీసీ..!

WTO building in amaravatiపెట్టుబడిదారులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ మేరకు ఆకర్షిస్తారో విశాఖ వేదికగా మరోసారి రుజువవుతోంది. కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు చెప్పినట్లు తెలంగాణాకు హైదరాబాద్ ఉంటే, ఏపీకి చంద్రబాబు ఉన్నారన్న రీతిలో చంద్రబాబు సాక్షిగా పెట్టుబడులు వరదలా వస్తున్నాయి.

ఇందులో ప్రముఖంగా చెప్పుకోదగినది… అమెరికాలోని న్యూయార్క్ లో గల వరల్డ్ ట్రేడ్ సెంటర్ ను అమరావతిలో ఏర్పాటు చేయనుండడం. 800 కోట్లతో నిర్మితం కానున్న ఈ భారీ భవంతికి ఒప్పందాలు కుదిరాయి. ‘అమరావతి’ నిర్మాణంతో పాటే ఈ వరల్డ్ ట్రేడ్ సెంటర్ (డబ్ల్యూటీసీ) నిర్మాణం జరగనుందని తెలుస్తోంది.

ADVERTISEMENT

రెండు రోజుల్లో దాదాపు 3.90 లక్షల కోట్ల ఒప్పందాలు కుదరగా, ఇందులో అమరావతి పరిధిలో దాదాపు 13 వేల కోట్ల మేర పెట్టుబడులు రానున్నాయి. అమరావతి నిర్మాణం ప్రారంభం కాక ముందే వరల్డ్ ట్రేడ్ సెంటర్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు అమరావతికి తరలి రావడం పట్ల రాజకీయ విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా చంద్రబాబుపై ఉన్న నమ్మకమేనని అభిప్రాయ పడుతున్నారు.

ADVERTISEMENT
Latest Stories