టాక్సిక్ రిలీజ్ అయ్యింది, సోషల్ మీడియా మొత్తం దుమ్మెత్తిపోశారు. ఏంటీ సినిమా, ఏంటీ సీన్లు అంటూ యష్ ని క్వశ్చన్ చేశారు. ఆ ఎఫెక్ట్ కలెక్షన్స్ మీద పడింది. ఓపెనింగ్స్ బానే ఉన్నప్పటికీ.. వీకెండ్ కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. దాంతో కన్నడ హీరోలు రంగంలోకి దిగి సినిమా బాగుందని, యష్ ప్రశంసార్హుడని పోస్టులు పెట్టడం ప్రారంభించారు.
జన నాయగన్ సినిమా కేవలం తమిళనాడులో సూపర్ హిట్ అన్నట్లు.. టాక్సిక్ కూడా కేవలం కన్నడలో మాత్రమే ఆడుతుంది. ఈ విషయాన్ని యష్ తల్లి పుష్ప తీసుకోలేకపోయారు. అందుకే ప్రెస్ మీట్ పెట్టి మరీ తెలుగు చిత్రసీమ నుండి యష్ ను తొక్కేయడానికి ప్రయత్నిస్తున్నారని, ఇది కరెక్ట్ కాదని వార్నింగులకు దిగింది.
“కోట బొమ్మాళి” అనే సినిమా ఈవెంట్లో అల్లు అరవింద్ “కేజీఎఫ్ ముందు యష్ పెద్దగా ఎవరికీ తెలియదు కదా.. ఏదైనా సినిమాని పెద్దగా చూపించాలి, అప్పుడే ఆడతాయి” అని చాలా ఒద్దికగా ఇండస్ట్రీ విధానాన్ని వివరించిన తీరును కన్నడిగులే గుడ్డిగా ట్రోల్ చేస్తున్నారు అనుకుంటే.. ఇప్పుడు యష్ మదర్ పుష్పమ్మ కూడా ఆ లిస్ట్ లో చేరింది, కేజీఎఫ్ కంటే ముందే నా కొడుక్కీ హిట్స్ ఉన్నాయి.. వాడేమీ బయటోడు కాదు అంటూ వెనకేసుకొచ్చింది. అక్కడితో ఆగకుండా.. రవితేజ “టైగర్ నాగేశ్వర్రావు” ప్రమోషన్స్ లో యశ్ గురించి అడగగా “కేజీఎఫ్” మాత్రమే చూసానని వేరేవి చూడలేదని చెప్పాడు.
ఇప్పుడు ఆ వీడియోని కూడా బయటికి తవ్వి.. రవితేజ కావాలనే యశ్ ని తొక్కేస్తున్నాడని, అతని ఇరుముడి కలెక్షన్స్ కోసం టాక్సిక్ కి థియేటర్లు దొరక్కుండా చేస్తున్నాడని, దానికి తెలుగు ఇండస్ట్రీ మొత్తం సపోర్ట్ చేస్తుందని, యశ్ ఏదో ఒంటరి పోరాటం చేస్తున్నాడని కన్నడిగులు సోషల్ మీడియాలో ఇష్టమొచ్చినట్లు నెరేటివ్స్ రాసుకుంటున్నారు.
యశ్ వాళ్ల అమ్మగారు కూడా విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోకుండా అల్లు అరవింద్ & రవితేజను టార్గెట్ చేసి మాట్లాడడం, ముఖ్యంగా అల్లు అర్జున్ ని ఇండైరెక్ట్ గా “నా కొడుకేమీ డబ్బుతో పుట్టలేదు, బ్యాగ్రౌండ్ లేదు” అని యష్ ని ఎలివేట్ చేసే ప్రయత్నం చేయడం అనేది బన్నీ ఫ్యాన్స్ సీరియస్ గా తీసుకున్నారు. దాంతో ఆవిడ ఏళ్ల క్రితం ఒక స్కామ్ లో భాగస్వామి అయిన వీడియోలు, యశ్ స్వయంగా కేజీఎఫ్ ప్రమోషన్స్ లో “నేను ఎవరో ఇక్కడ ఎవరికీ తెలియదు, ఓవర్ నైట్ స్టార్ అయ్యాను” అంటూ ఇచ్చిన ఇంటర్వ్యూలు వైరల్ చేస్తున్నారు.
అయినా.. సినిమా నచ్చలేదు అని చెప్పడాన్ని రాష్టానికి, భాషకి అంటగట్టి.. ఈ స్థాయిలో గోల చేయడం మాత్రం కన్నడిగులకే చెల్లింది. గతంలో “కాంతార, సు ఫ్రమ్ సో” వంటి కన్నడ సినిమాల డబ్బింగ్ వెర్షన్లను తెలుగు ప్రేక్షకులు ఎంతలా ఆదరించారో మర్చిపోయి వాగుతున్నారు.







