ప్రొడ్యూసర్ పేరు వింటే కస్సుమంటున్న కుర్ర హీరో

Young Hero’s Career Takes a Shocking Turn After One Flop

అతడో కుర్ర హీరో, ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా క్యారెక్టర్ రోల్స్ తో కెరీర్ మొదలుపెట్టి అంచలంచెలుగా హీరోగా ఎదిగాడు. మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకొని.. ప్రామిసింగ్ యాక్టర్ అనే క్రెడిబిలిటీ సంపాదించుకున్నాడు. ఆ హీరోతో సినిమా అనగానే ఇండస్ట్రీ సర్కిల్ & ఓటీటీ సర్కిల్స్ లో ఆసక్తి రేకెత్తించే స్థాయికి ఎదిగాడు.

దాంతో ఎలాంటి తప్పులు చేయకుండా, చాలా జాగ్రత్తగా కెరీర్ ప్లాన్ చేసుకోవాలి అనుకున్నాడు. అందుకే మంచి సబ్జెక్టులు ఎంచుకొని, వాటి మీద వర్క్ చేయడం ప్రారంభించాడు. ఇంచుమించుగా ఒకేసారి మూడు సినిమాలు సైన్ చేశాడు. అన్నీ మినిమం గ్యారెంటీ స్క్రిప్ట్స్. అంతా బాగుంది, సైలెంట్ గా పెద్ద స్థాయి హీరో అయిపోవాలి అని కలలు కన్నాడు.

ADVERTISEMENT

కట్ చేస్తే.. ఓ మీడియం సైజ్ బడా నిర్మాత అద్భుతమైన ప్రాజెక్ట్ ఇది అంటూ ఆ కుర్రాడి దగ్గరకి వచ్చి, అతడి ఇష్టంతో సంబంధం లేకుండా ఒక ప్రాజెక్ట్ చేసి డైరెక్టర్ తప్ప అన్నీ తానే అయ్యి చూసుకున్నాడు. దగ్గరుండి రిలీజ్ చేశాడు. ప్రీమియర్ షోస్ కే సినిమా ఫ్లాప్ అని డిక్లేర్ అయిపోయింది.

సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా హీరో క్రేజ్ ను నిర్మాత బాగానే క్యాష్ చేసుకున్నాడు. ఓటీటీ, డిజిటల్ అంటూ బాగానే మిగుల్చుకున్నాడు. హీరోకి రెమ్యునరేషన్ అయితే ఇచ్చాడు కానీ.. అతడి క్రెడిబిలిటీని పోగొట్టాడు. దాంతో.. అప్పటివరకు ఆ కుర్ర హీరోని క్యాస్ట్ చేసుకోవాలనుకున్న చాలా మంది దర్శకులు, నిర్మాతలు ఆ ఫ్లాప్ సినిమాలో హీరో ఓవర్ యాక్షన్ చూసి వెనకడుగు వేశారు.

అప్పటినుండి ఆ కుర్ర హీరో సదరు నిర్మాత పేరు చెప్తే చాలు నిప్పులు చెరుగుతున్నాడు. అతను నా కెరీర్ ని తన ప్రాఫిట్స్ కోసం నాశనం చేయబోయాడు. జీవితంలో పొరపాటున కూడా ఆ నిర్మాతతో లేదా అతని సర్కిల్ లో ఎవరితోనైనా మరో సినిమా చేయను. నాకు కెరీర్ స్టార్టింగ్ లోనే ఇలా బుద్ధిరావడం మంచిదైంది అని వాపోతున్నాడు. పాపం ఎంతలా హర్ట్ అయ్యుంటే అలాంటి డెసిషన్ తీసుకుంటాడు చెప్పండి.

ADVERTISEMENT
Latest Stories