కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధులను శుక్రవారం విడుదల చేసింది. 14 రాష్ట్రాలకు 6,195.08 కోట్ల నిధులను కేంద్రం విడుదల చేసింది. రెవెన్యూ లోటు కింద రాష్ట్రాలకు కేంద్రం ఈ నిధులను విడుదల చేసింది. ఏపీకి రూ.491.41 కోట్లను కేంద్రం విడుదల చేసింది.
అయితే నిధులు వచ్చాయో లేదో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పథకాల పేరిట పందేరం మొదలుపెట్టేసింది. వైఎస్సార్ ఆసరా పేరిట కొత్త స్కీం మొదలు పెట్టి 6,792 కోట్లు… ఈ స్కీం కోసమే ఈ నెల మొదట్లో దేశంలోనే అత్యధిక వడ్డీకి రాష్ట్రం 3,000 కోట్లు అప్పు సమీకరించేది. జగన్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కూడా కాకముందే కొత్తగా లక్ష కోట్ల అప్పుకు దగ్గర పడటం విశేషం.
అప్పులకు వడ్డీలు కట్టడానికి, ప్రతి నెల జీతాలు, పెన్షన్లు ఇవ్వడానికే రాష్ట్రం వద్ద డబ్బులు లేవు. దానికి తోడు కొత్త పథకాలతో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి మరింత కుంటుపడుతుంది. దీనితో అభివృద్ధికి, ప్రాజెక్టులకు నిధులు లేని పరిస్థితి. ప్రజల మీద తలసరి అప్పు విపరీతంగా పెరిగిపోతుంది.
ఇదే కొనసాగితే భవిష్యత్తులో రాష్ట్రానికి భయానక పరిస్థితులు తప్పవు. బహుశా ఆ స్థానిక ఎన్నికలైన పూర్తయ్యి ఉంటే ఈ ఓటు బ్యాంకు రాజకీయాలు ఆగేవేమో! కరోనా కారణంగా అవి ఎప్పుడు జరుగుతాయో తెలియని పరిస్థితి. అవి వచ్చే వరకూ ఇలా అడ్డు అదుపు లేకుండా అప్పుల ప్రహసనం సాగిపోతూనే ఉండేలా ఉంది.





