శ్రీవారికి ఇచ్చిన మాట తప్పిన సీఎం జగన్?

YS Jagan Government ban on liquor in tirupati
మొన్నామధ్య తిరుపతిని మద్య రహితంగా చెయ్యాలని టీటీడీ పాలకమండలి తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపింది. గతంలో జగన్ దీనిపై హామీ ఇవ్వడంతో జరుగుతుందని అంతా అనుకున్నారు. ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించింది అని వార్తలు ప్రసారం చేసి హడావిడి చేశారు. అయితే ఆ ప్రతిపాదనను ప్రభుత్వం పక్కన పెట్టినట్లు గా కనిపిస్తుంది.

ఇటీవలే ప్రభుత్వం బార్ల లైసెన్సులు రద్దు చేసిన సంగతి తెలిసిందే. మద్య నిషేధం కోసమంటూ కొత్త బార్ల పాలసీ తెచ్చారు. కొత్త బార్ల కేటాయింపులు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. దీనిలో భాగంగా తిరుపతికి ఎనిమిది బార్లను కేటాయించారు. దీనితో ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పినట్టుగానే అనుకోవాలి. తిరుపతికి చెందిన ఒక అధికార పార్టీ నేత ఒత్తిడి ప్రభుత్వం పై పని చేసిందని పుకార్లు వినిపిస్తున్నాయి.

ADVERTISEMENT

అయితే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం తో శ్రీవారి భక్తులు పూర్తిగా నిరాశ పడుతున్నారు. మరో వైపు అమరావతికి ఒక్క బారు కూడా కేటాయించకపోవడం విశేషం. పక్కనే ఉన్న విజయవాడకు 71, గుంటూరుకు 49 బార్లు కేటాయించారు. సహజంగా రాజధానిగా అభివృద్ధి చేసే చోట జనసాంద్రత ఎక్కువ ఉంటుంది కాబట్టి వైన్ షాపులు, బార్లు ఎక్కువగా కేటాయిస్తూ ఉంటారు.

అయతే అమరావతి లో అలా చెయ్యక పోవడం మరిన్ని అనుమానాలు రేకెత్తిస్తోంది. అమరావతి నిర్మాణంపై అభివృద్ధి పై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా అని అనిపించకమానదు. వచ్చే ఎన్నికల నాటికి మద్యం అమ్మకాలు కేవలం స్టార్ హోటల్స్ లో మాత్రమే జరిగేలా చూస్తా అని అప్పట్లో జగన్ హామీ ఇచ్చారు. అయితే రేపు అనేది లేనట్టుగా ప్రకటిస్తున్న సంక్షేమ కార్యక్రమాల అమలుకు మద్యం నుండి వచ్చే ఆదాయం కీలకం. అటువంటి తరుణంలో నిషేధం విధించగలరా అనేది చూడాలి.

ADVERTISEMENT
Latest Stories