వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ అయిన “యాత్ర” సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వైఎస్సార్ రోల్ ను మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి పోషిస్తున్న ఈ సినిమా నుండి ఇప్పటికే ఫస్ట్ టీజర్, మొదటి లిరికల్ వీడియో సాంగ్ విడుదలై, సినిమాపై అంచనాలు ఏర్పడేలా చేసాయి. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా ఖరారు చేసారు.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు అయినటువంటి డిసెంబర్ 21వ తేదీన ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు రిలీజైన టీజర్, లిరికల్ సాంగ్ లను వైఎస్ జయంతి, వర్ధంతి రోజులకు విడుదల చేయగా, సినిమాకు మాత్రం వైఎస్ జగన్ పుట్టినరోజును స్పాట్ గా ఎంచుకోవడం విశేషం.
ADVERTISEMENT
[m9adh]
ADVERTISEMENT



