‘ఫోటో’తో అడ్డంగా దొరికిపోయిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి?

ys rajasekhar reddy tara chowdary‘కాల్ మనీ’ స్కాంలో అధికార పక్షం నేతలు ఉన్నారంటూ నిందితులతో కలిసి టిడిపి నాయకులు ఉన్న ఫోటోలను చూపిస్తూ… అసెంబ్లీ వేదికగా రచ్చ రచ్చ చేసిన జగన్ కు ప్రస్తుతం షాకిచ్చే ఫోటో ఒకటి దర్శనమిస్తోంది. ఎలాగైతే ‘కాల్ మనీ – సెక్స్ రాకెట్’తో టిడిపి నాయకులపై అభియోగాలు వచ్చాయో… అదే విధంగా గతంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా ఓ ‘సెక్స్ రాకెట్’లో ఇరుక్కున్నారా? అంటూ సదరు ఫోటోను చూపిస్తూ సోషల్ మీడియా వర్గీయులు జగన్ ను ఏకిపారేస్తున్నారు.

గతంలో ‘సెక్స్ రాకెట్’ పట్టుబడిన వారిలో తారా చౌదరి పేరు బహుశా పాఠకులకు గుర్తుండే ఉంటుంది. సెలబ్రిటీల నుండి రాజకీయ నాయకుల వరకు ఓ కుదుపు కుదిపిన తారా చౌదరి ఇటీవల కూడా విజయవాడలో ఓ కేసు విషయమై వార్తల్లో నిలిచారు. అలాంటి తారా చౌదరి గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డికి కాంగ్రెస్ కండువా కప్పుతూ ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. అంటే వైఎస్ నేతృత్వంలోనే ‘సెక్స్ రాకెట్’ నడిచిందా? అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

ADVERTISEMENT

దీనికి జవాబు వెతుక్కోవాల్సిన పని లేదు. జగన్ ‘అవివేక’ రాజకీయానికి పలువురు ఔత్సాహికులు సోషల్ మీడియాలో ఈ ‘ఫోటో’ను ఉదహరిస్తూ… ‘కాల్ మనీ’ స్కాంలో జగన్ చేస్తున్న వాదనను తప్పుపడుతూ… ‘జగన్ ఫోటో ప్రూఫ్ కు సోషల్ మీడియా కౌంటర్’ పేరుతో ప్రచారం చేస్తున్నారు. రాజకీయ నాయకులు, సినీ సెలబ్రిటీలు అన్నాకా చాలా మంది ఫోటోలు దిగుతూ ఉంటారని, అలా దిగిన వారు ఏదొక సందర్భంలో వార్తల్లోకి వస్తే, దానిని ఆయా ప్రముఖుల పైకి రుద్దడం ఎంతవరకు సమంజసమో జగన్ ఆలోచించుకుని రాజకీయాలు చేయాలని సోషల్ మీడియా వేదికగా వ్యక్తమవుతున్న అభిప్రాయాలు.

ADVERTISEMENT
Latest Stories