ప్రమోషన్స్ లో ముందున్న వైఎస్ బయోపిక్!

YS Rajasekhara Reddy  Biopic - Yatra movie updatesవైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితగాధతో తెరకెక్కుతోన్న “యాత్ర” సినిమా ప్రమోషన్స్ లో ముందుంది. వైఎస్ పుట్టినరోజు సందర్భంగా టీజర్ ను విడుదల చేసిన చిత్ర యూనిట్, తాజాగా వైఎస్ కాలం చేసిన రోజున ‘సమర శంఖం’ అనే లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేస్తున్నట్లుగా స్పష్టం చేసారు. సెప్టెంబర్ 2, ఉదయం 7 గంటలకు ఈ పాట విడుదల కాబోతోంది.

ADVERTISEMENT

[m9ad]

మహి వి రాఘవ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో వైఎస్ రోల్ ను మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి చేస్తున్నారు. విడుదలైన ఫస్ట్ టీజర్ అంచనాలను అందుకోవడంతో ఈ సినిమాపై వైఎస్ అభిమానుల్లో, వైసీపీ కార్యకర్తల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. టైమింగ్ చూసుకుని పబ్లిసిటీ చేస్తోన్న “యాత్ర” సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాలని భావిస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories