వివేక హత్య ఏవిదంగా ఎవరెవరు చేశారంటే….

YS_Vivekananda_Reddy_CBIవైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ సంచలన విషయాలు బయటపెట్టింది. ఈ కేసులో ఏ-2 నిందితుడుగా ఉన్న యాదాటి సునీల్ యాదవ్ బెయిల్‌ పిటిషన్‌పై సీబీఐ కోర్టు విచారణ చేపట్టినప్పుడు, అతనికి బెయిల్‌ మంజూరు చేయవద్దని వాదించిన సీబీఐ న్యాయవాది, ఈ హత్య కేసు దర్యాప్తులో సీబీఐ కనుగొన్న అనేక రహస్యాలని కోర్టులో బయటపెట్టారు. ఆ వివరాలు క్లుప్తంగా…

1. వివేకానంద రెడ్డి ఎంపీ సీటుకి పోటీ పడిన కారణంగానే అవినాష్ రెడ్డి (వైసీపీ ఎంపీ) ఆయనని హత్య చేయించారు.

ADVERTISEMENT

2. హత్య జరిగిన సమయంలో ఏ-1: ఎర్రగంగిరెడ్డి, ఏ-2: సునీల్ యాదవ్, ఏ-4: ఏ-5: దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, ఉమా శంకర్ రెడ్డి వివేకానంద రెడ్డి ఇంట్లోనే ఉన్నారు.

3. దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి సాయంతో అవినాష్ రెడ్డి, ఆయన తండ్రిభాస్కర్ రెడ్డి వివేకా హత్యకి కుట్ర పన్నారు. దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఈ హత్యని ప్లాన్ ప్రకారం అమలుచేశారు.

4. వివేకానందరెడ్డిని ద్వేషిస్తున్న యాదాటి సునీల్ యాదవ్, డ్రైవర్ షేక్ దస్తగిరి, ఉమాశంకర్ రెడ్డిలని ఈ హత్యకి వినియోగించుకొన్నారు.

5. ఈ హత్య కోసం రూ.40 కోట్లకి జరిగిన ఒప్పందంలో యాదాటి సునీల్ యాదవ్ కీలకపాత్ర పోషించారు.

6. వివేకా హత్య కోసం ఉపయోగించిన గొడ్డలిని అప్రూవర్‌గా మారిన డ్రైవర్ దస్తగిరి కదిరి నుంచి కొని తీసుకువచ్చాడు. అంతవరకు శివశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్ అవినాష్ రెడ్డి ఇంట్లో వేచి ఉన్నారు.

7. అందరూ కలిసి వివేకానడరెడ్డిని 2019, మార్చి 15వ తేదీ తెల్లవారుజామున హత్య చేశారు.

8. ఆ తర్వాత అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి వివేకా హత్యని గుండెపోటుగా చిత్రీకరించడం, వివేకా ఇంట్లో సాక్ష్యాధారాలని (రక్తపు మరకలు, హత్యకి ఉపయోగించిన గొడ్డలి)ని మాయం చేసేందుకు తోడ్పడ్డారు.

9. హత్య జరిగిన తర్వాత అవినాష్ రెడ్డి ఎవరెవరితో ఎంత సేపు ఫోన్లో మాట్లాడారో ఆ నెంబర్లు సీబీఐ న్యాయవాది కోర్టుకి సమర్పించారు.

ఈ కేసులో కీలక అంశాలని సీబీఐ కోర్టులో బయటపెట్టినందున ఇకపై ఈ కేసు విచారణని మరింత వేగవంతం చేయబోతున్నట్లు స్పష్టమవుతోంది. ఈ హత్యతో తనకి ఎటువంటి సంబందమూ లేదని వాదిస్తున్న వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని జనవరి 28వ తేదీన సీబీఐ అధికారులు హైదరాబాద్‌కి పిలిపించుకొని ఒకసారి ప్రశ్నించారు. మళ్ళీ ఈ నెల 24వ తేదీన మరోసారి విచారణకి హాజరుకావలని నోటీస్ పంపారు. ఈ హత్యకి ఆయనే ప్రధాన సూత్రధారి అని సీబీఐ స్పష్టం చేసినందున ఈసారి విచారణకి హాజరైనప్పుడు ఆయనని ప్రశ్నించి విడిచిపెడుతుందా లేక అరెస్ట్ చేస్తుందా?అనేది ఆరోజే తెలుస్తుంది.

ADVERTISEMENT
Latest Stories