“యాత్ర”కు ఊపు తెప్పిస్తారా?

YSR Biopic Yatra Movie ready for releaseవైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన పాదయాత్రను కధగా ఎంచుకుని, మమ్ముట్టి ప్రధానపాత్రలో తెరకెక్కించిన “యాత్ర” సినిమా ఈ నెల 8వ తేదీన విడుదల కానున్న విషయం తెలిసిందే. ధియేటిరికల్ ట్రైలర్ తో సహా ఇప్పటివరకు విడుదల చేసిన ప్రమోషనల్ మెటీరియల్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉన్నప్పటికీ, ట్రేడ్ వర్గాల్లో ఈ సినిమాపై కావాల్సినంత బజ్ అయితే లేదు. బహుశా ఆ లోటును నేడు జరగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏమైనా పూడుస్తుందేమో చూడాలి.

ADVERTISEMENT

ఇప్పటికే మమ్ముట్టి చేత మీడియా ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్ లు చిత్ర యూనిట్ నిర్వహిస్తోంది. అయితే ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ సినిమాలో పూరీ చెప్పినట్టు, సినీ ప్రేక్షకులకు కావాల్సిన మసాలా కంటెంట్ లేకపోవడంతో, బజ్ తక్కువగా ఉంది. దీంతో వైఎస్ అభిమానుల చూపులన్నీ ప్రీ రిలీజ్ ఈవెంట్ పై పడ్డాయి. “యాత్ర”కు ఊపు తెప్పించే మెటీరియల్ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్! మహి వి రాఘవ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాపై వైసీపీ వర్గాలు భారీగానే ఆశలు పెట్టుకున్నారు.

ADVERTISEMENT
Latest Stories