నాని ట్రోలింగ్ వీడియో!

Perni-Nani Trollingతెలుగుదేశం పార్టీని ఇరుకున పెడదామని మంత్రి నాని గారు చేసిన ప్రయత్నం చివరికి వైసీపీ మెడకే చుట్టుకోవడం విశేషం. ఈ రోజు సినీ ఎగ్జిబిటర్లతో జరిపిన సమావేశం తర్వాత ప్రెస్ మీట్ లో వ్యాఖ్యానించిన నాని, తమకు ఎలాంటి సినిమా అయినా ఒకటే అని, అది ‘ఆర్ఆర్ఆర్’ అయినా, చిన్న సినిమా అయినా… ఏదైనా ఒక్కటే అన్న అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.

అలాగే తమకు గత ప్రభుత్వం మాదిరి తన, మన బేధాలు ఉండవని, గత ప్రభుత్వం బావమరిది చేసిన సినిమాకు పన్ను మినహాయింపు ఇచ్చి, చిరంజీవి నటించిన సినిమాకు ఇవ్వలేదన్న విషయం తెలిసిందేగా అంటూ వ్యాఖ్యానించారు. ఇలాంటి వ్యత్యాసం, రాగద్వేషాలు తమకు ఉండవని, ఏదైనా రూల్ కు లోబడి ఉంటుందని చెప్పుకొచ్చారు.

ADVERTISEMENT

అయితే మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమా “సైరా” 2019 అక్టోబర్ లో విడుదలైంది. అప్పుడు అధికారంలో ఉన్నది వైసీపీ ప్రభుత్వమే! మరి పన్ను మినహాయింపును ఇవ్వనిది ఏ ప్రభుత్వం? అంటూ సోషల్ మీడియాలో నానికి సంబంధించిన వీడియోతో ట్రోల్ చేస్తున్నారు. బహుశా వైసీపీ సర్కార్ చేసిన పనిని నాని గారు పొరపాటున ఒప్పేసుకున్నారేమో అంటూ రకరకాలుగా ట్రోల్ చేస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories