
మెగా ఫాన్స్ vs అల్లు ఆర్మీ అన్నటుగా సాగిన నంద్యాల ఎన్నికల ఘట్టాన్ని మరోసారి మీడియాలో చర్చకు తెచ్చారు అల్లు అర్జున్. కూటమి vs వైసీపీ అంటూ హోరాహోరీగా జరుగుతున్న ఎన్నికల ప్రచారం చివరి రోజున తన స్నేహితుడు నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవికి మద్దతుగా నంద్యాల వచ్చారు బన్నీ.
బన్నీ రాకతో నంద్యాలలో వైసీపీ రాత మారకపోయినా అల్లు అర్జున్ మాత్రం కేసుల రూపంలో రిటర్న్ గిఫ్ట్ అందుకున్నారు. ఎన్నికల సందర్భంగా సెక్షన్ 144, పోలీస్ యాక్ట్ 30 అమలులో ఉండగా నంద్యాల చేరుకున్న బన్నీ అనుమతి లేకుండా భారీగా జనసమీకరణ చేపట్టారని ఆయన మీద కేసు నమోదయ్యింది.
అయితే ఆ కేసును క్యాష్ చేయాలంటూ అల్లు అర్జున్ ఇపుడు ఏపీ హై కోర్ట్ ను ఆశ్రయించారు. ఏపీ ఎన్నికల సమయంలో నంద్యాలలో తన పై నమోదయిన కేసును క్యాష్ చేయాలనీ ఏపీ హై కోర్టులో బన్నీ వేసిన పిటిషన్ ను న్యాయస్థానం రేపు విచారించే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే బన్నీ వ్యవహార శైలి పట్ల మెగా అభిమానులలో ఒక వర్గం బన్నీ గుర్రుగా ఉన్నారు.
దానికి తోడు త్వరలో రిలీజ్ కు సిద్ధంగా ఉన్న బన్నీ పుష్ప 2 సినిమా మీద కూడా కొంతమంది పవన్ ఫాన్స్ వ్యతిరేకంగా ఉన్నారు. ఇటువంటి సమయంలో బన్నీ మళ్ళీ ఈ నంద్యాల వివాదాన్ని తెరమీదకు తీసుకురావడం, దాని మీద చర్చకు తావివ్వడం అనవసరమైన చర్యగా భావించాలి.
మొన్న కంకిపాడు లో జరిగిన పల్లె పండుగ సభలో ప్రసంగించిన పవన్ తనకు సినీ పరిశ్రమలో ఎవరి మీద వ్యతిరేకత ఉండదని, అందరు బాగుండాలని కోరుకునే వ్యక్తులలో తానూ ఒకరని, అల్లు అర్జున్ పేరును కూడా ప్రస్తావించారు.
దీనితో ఈ రెండు కుటుంబాల మధ్య సాగుతున్న సోషల్ మీడియా వార్ కు కాస్త విరామం దొరికినట్లయింది. ఈ సమయంలో బన్నీ తీసుకున్న ఈ నిర్ణయం రెండు కుటుంబాల అబిమనుల మధ్య ఏర్పడిన పాత గాయాన్ని మాపుతుందా.? లేక పాత గాయాన్ని మళ్ళీ రేపనుందా.? అనేది చూడాలి.
విశాఖ మేయర్ పదవిని జనరల్ మహిళకు కేటాయించడంతో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. అయితే టీడీపీ నుంచి నందమూరి బాలకృష్ణ…
Andhra Pradesh politics got largely streamlined after the removal of YCP from power. Usually abusive…