రంగు తీర్పుపై వైఎస్సార్ కాంగ్రెస్ లో బెంగ!

YSRCP colour paintings to govermnet buildingsగుంటూరు జిల్లాలో పల్లపాడులో ఎన్నారైల విరాళాలతో నిర్మించిన పంచాయతీ కార్యాలయ భవంతికి వైఎస్సార్ కాంగ్రెస్ రంగులు వెయ్యడంతో వారు హైకోర్టుని ఆశ్రయించారు. ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు వేయడమేంటని హైకోర్టు ప్రశ్నించింది. హైకోర్టు దీనిపై పదిరోజుల్లోగా తమకు నివేదిక ఇవ్వాలని గుంటూరు జిల్లా కలెక్టర్ ను ఆదేశించింది.

దీనితో రాష్ట్రంలో రంగులు వేసే పనులు మధ్యలోనే నిలిపేశారు. కలెక్టర్ ఏమని నివేదిక ఇస్తారు దానిపై హైకోర్టు ఎలా స్పందిస్తుందనేది చూడాలి. హైకోర్టు గనుక ఈ విషయంలో సీరియస్ అయితే రంగులు వెయ్యడానికి, వాటిని తీయడానికి అయ్యే ఖర్చుని వైఎస్సార్ కాంగ్రెస్ ఖాతా నుండి చెల్లించాలని ఆదేశించవచ్చని న్యాయనిపుణులు అంటున్నారు.

ADVERTISEMENT

ఒకవేళ అదే జరిగితే అధికార పార్టీకి అప్రతిష్ట అనే చెప్పుకోవాలి. అంతే కాకుండా అదంతా తడిచి మోపెడు అవుతుంది అంటున్నారు. ఈ రంగులకు గానూ కనీసం భవంతికి 50,000 రూపాయిలు ఖర్చుపెడుతున్నారట. ఒక్క గ్రేటర్ విశాఖలో ఉన్న 572 వార్డు ఆఫీసులలో ఇప్పటికే 150 భవనాలకు రంగులు వేశారు.

వీటిలో 270 అద్దె భవనాలు ఉంటే వాటికి కూడా రంగులు వెయ్యడానికి యజమానులతో మాట్లాడారు. వీటి అన్నింటికీ డబ్బులు పెట్టుకోవాలంటే వైఎస్సార్ కాంగ్రెస్ కు తడిచిమోపెడు అవ్వడం ఖాయం. అయితే అంతే మొత్తంలో ప్రభుత్వ ఖజానాకు చిల్లు పడిందని కూడా చెప్పుకోవాలి.

ADVERTISEMENT
Latest Stories