వైసీపీ నేతలు, కార్యకర్తలలో అంతర్గతంగా ఎంత ఆవేదన, అసహనం పేరుకుపోయిందో విజయనగరం జిల్లా వైసీపీ బహిష్కృత నేత, మాజీ ఎమ్మెల్యే బడుకొండ అప్పలనాయుడి ఒక్క ప్రెస్‌మీట్‌తో బయటపడింది.
అయన మాటలు విన్నప్పుడు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గురించి ఆయన ప్రత్యర్ధులు, మీడియాలో ఓ వర్గం చేస్తున్న విమర్శలు నిజమే కదా? అని అనిపించక మానవు.
ముందుగా జగన్ గురించి బడుకొండ అప్పలనాయుడు ఏమన్నారో చూద్దాం.
అక్కడ తాడేపల్లి ప్యాలస్‌లో కూర్చొన్న మీకు గ్రామస్థాయి ఎన్నికలు ఏవిధంగా జరుగుతాయో తెలీదు. కనుకనే ఏకగ్రీవాలు జరిగితే టికట్ ఇవ్వనని బెదిరిస్తున్నారు. గ్రామాలలో నేతలు, వారి కుటుంబాలకు ఉండే గౌరవ మర్యాదలు, వారు చేసే సేవలను చూసే గ్రామస్తులు సర్పంచ్‌లను ఎన్నుకుంటారు తప్ప మీ మొహం చూసి కాదు. అయినా టికెట్ ఇవ్వనని చెప్పడానికి వైసీపీ మీ సొంత జాగీరనుకున్నారా? ఇది మా అందరి సమిష్టి కష్టం.
నాడు అధికారంలో ఉన్నప్పుడు సక్రమంగా పాలన సాగించి ఉంటే వైసీపీకి నేడు ఈ దుస్థితి కలిగేదే కాదు. కనీసం సిఎం చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌కున్న ఆలోచన కూడా మీకు లేకపోవడం వల్లనే బిజేపిని దూరం చేసుకున్నారు. మీరే పార్టీని ఓడించుకున్నారు. వారు తెలివిగా పావులు కదిపి తమ పార్టీలను గెలిపించుకున్నారు.
మీ తప్పుడు నిర్ణయాలు, తప్పుడు వ్యూహాల కారణంగా మా జిల్లాలో కనీసం మొహ పరిచయాలు కూడా లేని జనసేన నేతలు గెలిచారు.
వారికి మా గ్రామాలు ఎక్కడున్నాయో తెలీదు. అక్కడకు ఎలా చేరుకోవాలో దారి కూడా తెలీదు. ఇక గ్రామాలలో ఎంతమంది ఓటర్లున్నారో తెలిసే అవకాశమే లేదు. అయినా అందరూ గెలిచారు.. మీ వల్లనే కదా?
స్థానిక సంస్థల ఎన్నికలలో తేడా వస్తే ఊరుకోనని మమ్మల్ని హెచ్చరిస్తున్నారు. మరి మీ తప్పుల కారణంగా పార్టీ ఓడిపోతే దానికి మీరు కూడా బాధ్యత వహించాలి కదా?
పార్టీ కోసం రేయింబవళ్ళు కష్టపడుతున్నవాళ్ళని ఇంకా కష్టపడమని చెపుతున్నారు. ఉన్నందంతా పార్టీ కోసం ఊడ్చిపెట్టక తప్పని పరిస్థితి కల్పిస్తున్నారు.
వాలంటీర్లతో వైసీపీ గెలుస్తుందని మీరెలా అనుకున్నారో మాకు తెలీదు. కానీ వాలంటీర్ల కారనంగానే వైసీపీ ఓడిపోయింది కదా?
మేమందరం మొగాళ్ళమే. కానీ ఎవరూ పిల్లలు కనకుండా మీరు మా అందరికీ మూకుమ్మడిగా ఫ్యామిలీ ప్లయింగ్ ఆపరేషన్ చేయించినట్లు, వాలంటీర్ల వ్యవస్థని తెచ్చి మా నెత్తిన పెట్టి మా అందరినీ అనామకులుగా మార్చేశారు కదా?
అధికారంలో ఉన్నప్పుడు మీరు చేసిన తప్పిదాల వలన, ఇప్పుడు మీ తప్పుడు నిర్ణయాల వలన స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేసినా ఎవరూ గెలవలేని పరిస్థితి నెలకొంది.
ఇటువంటి పరిస్థితులలో సర్పంచ్ పదవులకు ఒక్కొక్కరు రూ.20-30 లక్షలు ఎందుకు ఖర్చు చేయాలి?” అని మాజీ ఎమ్మెల్యే బడుకొండ అప్పలనాయుడు సూటిగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించారు.
పోలవరం రివర్స్ టెండరింగ్, అమరావతి, మూడు రాజధానులు, విశాఖ రాజధాని, రుషికొండ ప్యాలస్, ప్రజావేదిక కూల్చివేత, అన్నాక్యాంటీన్లు మూసివేత, వైసీపీ రంగులు, జగన్ బొమ్మలు…ఒకటా రెండా?
ఇవన్నీ చాలవన్నట్లు మద్యం కుంభకోణం, మళ్ళీ దానిలో మద్యం రవాణా కుంభకోణం వంటివన్నీ చాలా స్పష్టంగానే కనిపిస్తున్నాయి. మాజీ ఎమ్మెల్యే బడుకొండ అప్పలనాయుడు ఇదే చెప్తున్నారు.. వీటి గురించే అడుగుతున్నారు కదా?
నాయకులందరికీ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేశారు జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి – Baddukonda Appalanaidu https://t.co/JbXlOrjTPu
— (@dmuppavarapu) October 3, 2026






