వైసీపీ ‘హిందూ’ వ్యతిరేకవాదాన్ని ప్రోత్సహిస్తుందా.?

YSRCP Hindu Controversy

గత రెండు మూడు రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ప్రశ్న రావణ్ పేరు విస్తృతంగా వినిపిస్తుంది, అలాగే ఆ పేరు పై సోషల్ మీడియాలో భిన్న కథనాలు ప్రచారం అవుతున్నాయి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటుగా హిందూ దేవుళ్ళ పై కూడా ప్రశ్న రావణ్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసారు.

ఆయన సోషల్ మీడియా వేదికగా హిందువుల ఆరాధ్య దేవుడైన రాముని పై హిందూ పురాణాలైన రామాయణం, మహాభారతం గాధల మీద కూడా హిందువుల మనోభావాలకు వ్యతిరేకంగా ప్రకటనలు చేసారు. రాముడు దేనికి ఆదర్శం.? ద్రౌపతి చరిత్ర ఏం సూచిస్తుంది.? అంటూ అర్ధంపర్ధం లేని ఆరోపణలు చేస్తూ సనాతన ధర్మాన్ని కించపరిచేలా వ్యాఖ్యానించారు.

ADVERTISEMENT

అయితే అటువంటి ప్రశ్న రావణ్ ను ఇప్పుడు ఏపీ పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపితే వైసీపీ “హే రామ్ అంటూ రావణ్” కు వత్తాసు పలుకుతుంది. వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ మొదలుకుని ఆ పార్టీ అధికారిక ప్రతినిధి వెంకటరెడ్డి వరకు ప్రశ్న రావణ్ అరెస్టు ఖండిస్తూ ఆయనకు మద్దుతుగా ప్రకటనలు చేస్తున్నారు.

ప్రశ్న రావణ్ పవన్ ను ప్రశ్నిచడమే దేశ ద్రోహమా.? ప్రశ్న ను కూటమి ప్రభుత్వం అన్యాయంగా అరెస్టు చేసిందని, ఆయన పై చర్యలు అప్రజాస్వామ్యమని వైసీపీ గగ్గోలు పెడుతుంది. సోషల్ మీడియా వేదికగా ప్రశ్న రావణ్ హిందూ దేవుళ్ళకు వ్యతిరేకంగా చేసిన వీడియో లన్ని కూడా అదే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అయినా కూడా వైసీపీ ప్రశ్నకు అండగా నిలుస్తూ సభ్య సమాజానికి ఎం సందేశం ఇవ్వాలనుకుంటుంది. హిందూ మతాన్ని కించపరుస్తూ, హిందూ దేవుళ్లను అవమానిస్తూ, సనాతనధర్మాన్ని అవహేళన చేస్తూ సోషల్ మీడియా లో రెచ్చిపోతున్న ఈ ఉన్మాదిని అరెస్టు చేయడం ప్రభుత్వ నేరమంటున్న వైసీపీ హిందూ సమాజానికి ఏం చెప్పాలనుకుంటుంది.?

ఇటువంటి వారిని వైసీపీ మాదిరి పెంచి పోషిస్తే ఇక రేపటి తరానికి భారదేశం సంస్కృతీ, సంప్రదాయాన్ని వారసత్వంగా అందించగలరా.? ప్రశ్న రావణ్ కోసం గొంతెత్తుతున్న వైసీపీ హిందూ దేవుళ్ళ మీద అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు ఎందుకు ప్రశ్నించలేకపోయింది.? అంటే పరోక్షంగా వైసీపీ హిందూ వ్యతిరేకిని అని చెప్పకనే చెప్పాలని భావిస్తుందా.? అంటూ సోషల్ మీడియాలో వైసీపీ కి వ్యతిరేకంగా పోస్టు లు పుట్టుకొస్తున్నాయి.

ADVERTISEMENT
Latest Stories