కేసీఆర్ తో జాగ్రత్త…. జగన్ కు అభిమానుల హెచ్చరిక

KCR_YS_Jaganకేసీఆర్ ఎంతటి కఠిన రాజకీయవాది అనేది అందరికీ తెలిసిందే. వైఎస్ తో పొత్తు పెట్టుకుని ఆ తరువాత విభేదించినా, జగన్ మానుకోట ఘటన తీసుకున్నా, ఆ తరువాత పార్టీని విలీనం చేస్తా అని కాంగ్రెస్ ని తన వేలితో తన కన్నే పొడిపించినా ఆయన శైలే విలక్షణం. అటువంటి కేసీఆర్ ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ విభజనకు కారణమైన కేసీఆర్ ను ఆంధ్రప్రదేశ్ ను ఉద్దరించడానికే పుట్టాడు అన్నట్టు పొగిడేస్తున్నారు.

ADVERTISEMENT

కేసీఆర్ జగన్ కు స్నేహ హస్తం చాటినా ఒక పరిమితికి మించి జగన్ గురించి మీడియాలో మాట్లాడటం లేదు. అసెంబ్లీలో అయితే జగన్ ప్రస్తావన పెద్దగా తీసుకురావడం లేదు. అయితే జగన్ మాత్రం అక్కడా ఇక్కడా అని లేకుండా కేసీఆర్ ని పొగిడేస్తున్నారు. ఆ పొగడ్తలు అసెంబ్లీ రికార్డులలో కూడా నిక్షిప్తం అయిపోయాయి. రేపన్న రోజు కేసీఆర్ ఆలోచనా లేదా రాజకీయ అవసరాలు మారి వేరేగా పని చెయ్యడం మొదలు పెడితే అవన్నీ జగన్ మెడకే చుట్టుకుంటాయి. కేసీఆర్ అలా చెయ్యరు అని వాదిస్తే చరిత్ర ఒప్పుకోదు.

టీడీపీలో రాజకీయంగా పుట్టి ఎదిగి ఆ పార్టీని కబళించిన చరిత్ర కేసీఆర్ ది, సోనియాని దేవత అని పొగిడి ఇప్పుడు కాంగ్రెస్ ని భూస్థాపితం చేసే ప్రయత్నం చూస్తూనే ఉన్నాం… జగన్ కేసీఆర్ తో జాగ్రత్తగా ఉండాలని వైఎస్సార్ కాంగ్రెస్ అభిమానులే జగన్ ను వారిస్తున్నారు. అంత అతిగా నెత్తి మీద పెట్టుకోవాల్సిన అవసరం లేదని వారు అనుకుంటున్నారు. పైగా తెలంగాణతో కలిసి తెలంగాణాలో ఎక్కువగా ఉండే లక్షాయాభై వేల ప్రాజెక్టుకు సిద్ధం అవుతున్నారు జగన్. మరి ఈ విషయంలో జగన్ లెక్కలేంటో ఆయనకే తెలియాలి.

ADVERTISEMENT
Latest Stories