3 గంటలు ట్రాఫిక్ ఆపేసి రోడ్డు మీద పుట్టినరోజు చేసుకున్న వైకాపా ఎమ్మెల్యే తనయుడు

Vikas Kodeti - YS Jaganపి. గన్నవరం వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు తనయుడు వికాస్, తండ్రి అధికారం అడ్డుపెట్టుకుని రెచ్చిపోయాడు. మా నాన్న ఎమ్మెల్యే, ఇంక నియోజకవర్గంలో నాకు అడ్డు ఏముంటుంది అనుకున్నాడో ఏమో… ఏకంగా నాలుగు కూడళ్ల రోడ్డులో ట్రాఫిక్ దాదాపుగా మూడు గంటల పాటు ఆపేసి తన జన్మదిన వేడుకలు చేసుకున్నాడు.

ADVERTISEMENT

ఎమ్మెల్యే తనయుడు కావడంతో ఆయన అనుచరులు కూడా భారీ సంఖ్యలో హాజరయ్యి ఫుల్ గా హడావిడి చేశారు. వాహనదారులు రోడ్డు మీద నిలిచిపోవడంతో ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఒక చిన్న ఊరిలో మూడు గంటల పాటు ట్రాఫిక్ నిలిచిపోయింది అంటే వీరి హడావిడి అర్ధం చేసుకోవచ్చు. అంబాజీపేటలో ఈ ఘటన జరిగింది.

దూరప్రాంతాలకు వెళ్ళే బస్సులు కూడా నిలిచిపోయాయి. రోడ్డు మీదే స్టేజి వేసి ఫ్లెక్సీలు పెట్టి, అక్కడే కేక్ కటింగ్ కూడా చేసారు. సాయంత్రం వేళ కావడంతో స్కూల్ బస్సులు కూడా ఆగిపోయి పిల్లలు కూడా చాలా ఇబ్బందులు పాడారట. అయినా ఎమ్మెల్యే తనయుడికి అనుగ్రహం కలగలేదు.

కొండేటి చిట్టిబాబు మొట్టమొదటి సారి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం విశేషం. ఇటీవలే జరిగిన ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి చెందిన నేలపూడి స్టాలిన్ బాబుపై ఆయన 31,112 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు. జనసేన అభ్యర్థికి ఇక్కడ 36000 పై చిలుకు ఓట్లు పడటంతో నష్టపోయాం అని టీడీపీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

ADVERTISEMENT
Latest Stories