ప్రతిపక్షంతో పాటు హైకోర్టుని కూడా శత్రువుగా చూస్తుంది ఆంధ్రప్రదేశ్ లోని అధికారపక్షం… వైఎస్సార్ కాంగ్రెస్. నిన్న ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి హైకోర్టు మీద ఏకంగా పార్లిమెంట్ లోనే తీవ్ర విమర్శలు చేశారు. హైకోర్టు మీద పార్లమెంట్ లో అటువంటి దాడి చెయ్యడం చరిత్రలోనే మొట్టమొదటి సారి అని నిపుణులు అంటున్నారు.
మరో వైపు… ఆ పార్టీ తమ సోషల్ మీడియా తో హైకోర్టు జడ్జీల మీద దుష్ప్రచారానికి తెగబడుతుందని సమాచారం. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులోని పదమూడు జడ్జిలకు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం అమరావతిలో భూములు కట్టబెట్టిందని అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేస్తున్నారని సోషల్ మీడియా వింగ్ ఆరోపిస్తూ ప్రచారం చేస్తుంది.
అయితే చంద్రబాబు ప్రభుత్వం జడ్జీలకు భూములిచ్చిన మాట వాస్తవమే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఉన్నతాధికారులకు, జ్యూడిషల్ అధికారులకు రాజధానిలో నివాసస్థలం కేటాయించాలని అప్పటి ప్రభుత్వం ఒక జీవో జారీ చేసింది. ఆ ప్రకారమే జడ్జీలకు కూడా ఇచ్చింది. అయితే ఇది ఎటువంటి తెరచాటు వ్యవహారం కాదు.
ఈ విషయం తెలిసి కూడా… పార్టీ నాయకులతో విమర్శలు చేస్తే ఇబ్బంది కలుగుతుంది కాబట్టి.. తమ సోషల్ మీడియా వింగ్ తో ఈ ప్రచారానికి తెగబడింది. అయితే ఈ విషయాన్ని కోర్టు గనుక సీరియస్ గా తీసుకుంటే దీని వల్ల అమాయకులు ఇబ్బంది పడే అవకాశం ఉంది.





