ట్రైలర్ టాక్ – ఆల్ రౌండ్ షో!

zero-trailer-talk-is-shahrukh-khan-backఇతర ఖాన్ హీరోలకు దక్కినటువంటి అపూర్వమైన విజయాలను అందిపుచ్చుకోవడంలో బాలీవుడ్ బాద్ షా ఇప్పటివరకు విఫలమైన వైనం తెలిసిందే. అయితే డిసెంబర్ 21వ తేదీన విడుదల కాబోతున్న “జీరో”తో మాత్రం బాక్సాఫీస్ వద్ద తనదైన మార్క్ ను చూపిస్తానన్న విశ్వాసాన్ని ఈ సినిమా ట్రైలర్ కలిగించడంలో సక్సెస్ సాధించింది.

[m9ad]

ADVERTISEMENT

విలక్షణమైన సినిమాలను చేసే దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమాలో షారుక్ ఆల్ రౌండ్ షోను చూడవచ్చు. మూడు నిముషాల పాటు సాగిన ట్రైలర్ లోనే… హాస్యం, సెంటిమెంట్, ప్రేమ, పిచ్చి, అమాయకత్వం వంటి భావాలను అవలీలగా పండించి, తన అభిమానులకు కావాల్సిన ట్రీట్ ను అందించాడు షారుక్.

కధాపరంగా షారుక్ చేసిన ‘రొమాంటిక్ ఎంటర్టైనర్’ జోనర్ లోనే ఉండడం కొంత నిరుత్సాహానికి గురి చేసే అంశం కాగా, ఈ ట్రైలర్ కు మాత్రం అపూర్వమైన స్పందన లభిస్తోంది. ముఖ్యంగా షారుక్ గెటప్ అండ్ హావభావాలు మాత్రం వీక్షకులకు కన్నులవిందుగా మారాయి. అనుష్క శర్మకు కూడా మంచి రోల్ దక్కిన ఈ సినిమాలో కత్రీనా కైఫ్ గ్లామర్ డాల్ గా కనిపించనుంది.

ADVERTISEMENT
Latest Stories