“బిగ్ బాస్ 2″లో హీరో ఎంట్రీ!

pradeep machiraju in Bigg Boss 2 Teluguగత సీజన్ తో పోలిస్తే, కాస్త కళ తప్పిందని భావిస్తోన్న ‘బిగ్ బాస్ 2’ హౌస్ లోకి స్పెషల్ ఎంట్రీ వచ్చింది. అతిధిగా ఒక రోజు అలరించేందుకు వచ్చారో లేక వైల్డ్ కార్డు ఎంట్రీ అయ్యిందో గానీ, ప్రముఖ టాప్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు ‘బిగ్ బాస్’ హౌస్ లోకి ప్రవేశించారు. ఈ విషయాన్ని సదరు మీడియా ఛానల్ ఖరారు చేస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ కూడా చేసింది.

ADVERTISEMENT

ఆహ్లాదకరమైన, ఆరోగ్యకరమైన ఎంటర్టైన్మెంట్ కు ప్రదీప్ కేరాఫ్ అడ్రస్. దీంతో ప్రదీప్ ఎంట్రీతో ‘బిగ్ బాస్ 2’ ఫేట్ మారిపోతుందన్న అంచనాలు మొదలయ్యాయి. ఒక విధంగా చెప్పాలంటే బుల్లితెర ‘బిగ్ బాస్’లోకి హీరో ఎంట్రీ ఇచ్చినట్లే. అయితే అది ఒక రోజుకే పరిమితమా? లేక ఆట ముగిసే వరకు ఉంటుందా? అన్నది చూడాలి.

జూనియర్ ఎన్టీఆర్ అతిధిగా విచ్చేసిన “డీ” షో ముగియడంతో, కొంతవరకు ఫ్రీ అయినా, ప్రదీప్ చేతిలో చాలా షోలు ఉన్నాయి. దీంతో ‘బిగ్ బాస్’లో ప్రదీప్ ఉండడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక రోజుకే అయితే సూట్ కేసు అవసరం ఉండదు, కానీ ప్రదీప్ సూట్ కేసుతో లోపలికి అడుగు పెట్టడంతో వైల్డ్ కార్డు ఎంట్రీ అనే అనుకోవాలి.

ADVERTISEMENT
Latest Stories