పాపం విజయశాంతి…. అడ్డంగా దొరికిపోయారు

Vijayashanthi-comments-on-mahesh-babu-leads-to-trollsరాములమ్మగా, లేడీ అమితాబ్ గా తెలుగు తెరను ఒక ఊపు ఊపిన విజయశాంతి ఆ తరువాత రాజకీయాలలో ఒక వెలుగు వెలిగారు. తెరాసలో తెలంగాణ సాధనకు తనదైన పాత్ర పోషించి ఆ తరువాత కాంగ్రెస్ లో చేరారు. అయితే అప్పటి నుండి ఆమెకు కలిసి రావడం లేదు. ఇది ఇలా ఉండగా సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ సినిమా ద్వారా సినిమాలలోకి విజయశాంతి రీఎంట్రీ ఇస్తున్నారు. 13 ఏళ్ల తరవాత ఆమె మళ్లీ తన ముఖానికి మేకప్ వేసుకోబోతున్నారు.

ADVERTISEMENT

విజయశాంతి ఒక మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు… రొటీన్ గా మహేష్ బాబుని పొగడ్తలతో ముంచెత్తారు. అయితే అది మాములుగా చేస్తే పర్లేదు… కాకపోతే కొంచెం అతిగా చేసి అడ్డంగా దొరికిపోయారు. “మహేష్ బాబుతో నేను కృష్ణగారి కొడుకు దిద్దిన కాపురంలో పని చేశా… అప్పుడే ఈ కుర్రోడి టాలెంట్ అర్ధం అయ్యింది. అప్పట్లో మీడియాకు నేను ఇతను తెలుగు సినిమా ఇండస్ట్రీకి కాబోయే సచిన్ టెండూల్కర్ అని చెప్పా…. ఇప్పుడు నా మాటే నిజమైంది,” అని చెప్పుకొచ్చారు రాములమ్మ.

అయితే సోషల్ మీడియాలో ఇది వెంటనే తేలిపోయింది. కొడుకు దిద్దిన కాపురం సినిమా 1989 సెప్టెంబరులో రిలీజ్ అయ్యింది… అయితే సచిన్ టెండూల్కర్ అదే సంవత్సరం నవంబర్ లో అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టాడు. అప్పటికి సచిన్ టెండూల్కర్ భవిష్యత్తునే ఊహించడం కష్టం… అటువంటిది మన రాములమ్మ మహేష్ బాబుని ఆయనతో కంపేర్ చేశారట. పాపం విజయశాంతి…. సినిమా టచ్ బొత్తిగా పోయినట్టు ఉంది అందుకే చాలా తేలికగా దొరికిపోయారు.

ADVERTISEMENT
Latest Stories