పిక్ – ‘భర్త’తో పాటు సిగరెట్ పంచుకుంటున్న ‘భార్య’

kalyan Vaibhogame - wife smoking with husbandమార్చి 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న “కళ్యాణ వైభోగమే” సినిమా పబ్లిసిటీ ఊపందుకుంది. టీజర్లు, ప్రచార చిత్రాలతో సందడి చేస్తున్న ఈ సినిమాలోని ఓ పోస్టర్ సోషల్ మీడియాలో బాగా సందడి చేస్తోంది. “తన నోటిలో సిగరెట్ పెట్టుకున్న హీరోయిన్ మాళవిక, హీరో నాగశౌర్య సిగరెట్ వెలిగిస్తున్న వైనం వీక్షకులను కట్టిపడేస్తోంది. సమాజంలో ప్రస్తుత “ట్రెండ్”కు అనుగుణంగా ఉండడం వల్లనే ఈ పోస్టర్ కు విపరీతమైన ఆదరణ లభిస్తోంది.

పెళ్ళంటే ఇష్టం లేని ఒక యువ జంట పెళ్లి చేసుకున్న తర్వాత ఏం చేయనున్నారో… అనే అంశం మీద తెరకెక్కిన ఈ సినిమాను ‘అలా మొదలైంది, జబర్దస్త్’ చిత్రాల దర్శకురాలు నందిని రెడ్డి రూపొందించారు. విడుదలైన ట్రైలర్ ఎలాంటి గందరగోళానికి తావు లేకుండా స్పష్టంగా యూత్ ను టార్గెట్ చేసినట్లుగా కనపడడంతో ఈ సినిమాపై ఓ మోస్తరు అంచనాలు ఏర్పడ్డాయి. చాలా కాలంగా హిట్ కోసం ఎదురు చూస్తున్న నాగశౌర్యకు, దర్శకురాలు నందిని రెడ్డికి ఈ సినిమా విజయం అతి కీలకంగా మారింది.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories