రోహిత్ వీడ్కోలు, మరి విరాట్..?

rohit-sharma-retirement-from-test-format...-what-about-virat_

నిన్న సాయంత్రం భారత ప్రస్తుత టెస్ట్ మరియు వన్-డే సారధి రోహిత్ శర్మ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా టెస్ట్ ల కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఇలా, ఒక ఆటగాడు రిటైర్మెంట్ ప్రకటించటం కొత్తేమి కాదు, వింతా కాదు!

కానీ, చిత్రమేమనగా, సరిగ్గా రిటైర్మెంట్ ను ప్రకటించే కొన్ని గంటల ముందే రోహిత్ ను టెస్ట్ సారధి బాధ్యతల నుండి బీసీసీఐ తొలగించినట్లు వార్తలు వచ్చాయి. ఆ తరువాత రోహిత్ నుండి ఈ రిటైర్మెంట్ ప్రకటన వచ్చింది.

ADVERTISEMENT

గతేడాది సొంత గడప లో న్యూజిలాండ్ చేత భారత జట్టు వైట్-వాష్ అయినప్పటి నుండి రోహిత్ మీద మొదలైన విమర్శలకు బ్రేక్ వేసే ఇన్నింగ్స్ రోహిత్ నుంచి ఒక్కటి కూడా రాలేదు. అటు కెప్టెన్ గా ఒకే-ఒకే అనిపించుకుంటున్నప్పటికీ, టెస్టులలో తన ఆట తీరుతో క్రికెట్ అనలిస్టుల నుండి ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నారు రోహిత్.

న్యూజిలాండ్ పై ఘోర పరాభవం తో టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్ కు వెళ్లే అవకాశాలను తగ్గించుకున్న భారత్, ఆ తరువాత ఆసీస్ కు పయనమై, అక్కడ కూడా ఓటమి పాలయి, ఏకంగా ఫైనల్స్ నుండి నిష్క్రమించబడ్డారు.

గడిచిన రెండు టెస్ట్ ఫైనల్స్ లోను భారత్ పాలు పంచుకుంది. ఈసారి అర్హత సాధించనందు వాళ్ళ అవన్నీ రోహిత్ కెప్టెన్సీ ఖాతాలోకే వెళ్లిపోయాయి. ఆసీస్ సిరీస్ చివరి టెస్ట్ లో తనను తానే టీం నుండి డ్రాప్ చేసుకున్న రోహిత్, ‘నేనెప్పుడూ రిటైర్మెంట్ ప్రకటించాలి నేను ఆలోచించాలి, పెన్ను పేపరు పట్టుకుని లాప్ టాప్ ముందు కూర్చునేవారు కాదు!’ అని అన్నారు.

తాజాగా తాను పాల్గొన్న మీటింగ్స్ లో కూడా తన కళ్లన్నీ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ పైనే ఉందంటూ బదులిచ్చిన రోహిత్, మరి ఇంత హటాత్తు గా రిటైర్మెంట్ ఎందుకు ప్రకటించాడు..? అంటే దానికి సమాధానం తన బ్యాటింగ్ ఫారం అనే చెప్పవచ్చు.

కెప్టెన్ స్థాయిలో ఉన్నవారినే బ్యాటింగ్ సరిలేదని టీం నుండి బయటపెట్టేసారు. మరి గత కొంతకాలంగా కోహ్లీ కూడా ఈ ఫార్మాట్ లో అనుకున్న స్థాయిలో రాణించలేకపోతున్నారు. వీరిద్దరూ కూడా జట్టులో సీనియర్ ఆటగాళ్లు కావడం,గతంలో కూడా టీ- 20 పొట్టి ఫార్మాట్ కు ఇద్దరు ఒక్కసారే వీడ్కోలు పలకడంతో ఇప్పుడు టెస్టులలో కింగ్ కోహ్లీ ప్రస్తావన మీద కూడా చర్చ జరుగుతుంది.

మరి ఈ సంఘటన కోహ్లీ కి ఒక వెక్-అప్ కాల్ అవుతుందా..? విరాట్ తనను తాను టెస్ట్ లకు తగినట్టు మరొకసారి మలుచుకోగలడా..? లేక రోహిత్ మాదిరే వైట్ బాల్ కు దూరంగా జరుగుతారా.? అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.

ADVERTISEMENT
Latest Stories