2016 ఫోర్బ్స్ – రజనీకాంత్ తర్వాత మహేష్ బాబే!

2016-forbes-mahesh-babu-first-from-tollywood
2016 సంవత్సరానికి గానూ ఫోర్బ్స్ సెలబ్రిటీల జాబితా వచ్చేసింది. ఎలాంటి ట్విస్ట్ లు లేకుండా యధావిధిగా టాలీవుడ్ నుండి ప్రిన్స్ మహేష్ బాబు మరోసారి అగ్రస్థానంలో నిలిచారు. అయితే దక్షిణాది సెలబ్రిటీలతో పోలిస్తే… మహేష్ కంటే ముందుగా ‘సూపర్ స్టార్’ రజనీకాంత్ ఉన్నారు. ఇండియా వ్యాప్తంగా ఉన్న సినీ సెలబ్రిటీ హోదాలో రజనీకి 30వ స్థానం దక్కగా, మన టాలీవుడ్ ప్రిన్స్ కు 33వ స్థానం వరించింది. గతేడాదితో పోలిస్తే మహేష్ 3 స్థానాలు ముందుకు జరిగారు.

2012లో 31వ స్థానం, 2013లో 54, 2014లో 30, 2015లో 36వ స్థానంలో నిలిచిన ప్రిన్స్ ఈ ఏడాది 33తో సరిపెట్టుకున్నారు. మహేష్ తర్వాత టాలీవుడ్ నుండి టాప్ 50లో అల్లు అర్జున్ కు 43వ స్థానం దక్కగా, టాప్ 100లో జూనియర్ ఎన్టీఆర్ 55, రామ్ చరణ్ 67 వ స్థానాలలో ఉన్నారు. ఇక ఇండియా వ్యాప్తంగా పరిశీలిస్తే… సల్మాన్ ఖాన్ 1, షారుక్ ఖాన్ 2, విరాట్ కోహ్లి 3, అక్షయ్ కుమార్ 4, మహేంద్ర సింగ్ ధోని 5, దీపికా పదుకునే 6, సచిన్ టెండూల్కర్ 7, ప్రియాంకా చోప్రా 8, అమితాబ్ 9, హృతిక్ రోషన్ 10వ స్థానంలో నిలిచారు.

ADVERTISEMENT

ADVERTISEMENT
Latest Stories