ఈ సినిమా నచ్చకపోతే లక్ష రూపాయలు బహుమతి!

21st Century Love, 21st Century Love Movie Refund, 21st Century Love Telugu Movie Refund, 21st Century Love Movie 1 Lakh Refundప్రేక్షకులను తమ వైపుకు తిప్పుకునేందుకు ఒక్కొక్కరు ఒక్కో పబ్లిసిటీ స్టంట్లతో ముందుకొస్తున్నారు. పెద్ద సినిమాలకు సంబంధించినంత వరకు హీరోలే రాజులు గనుక, ఓపెనింగ్స్ కు కొదవుండదు. కానీ, చిన్న సినిమాల పరిస్థితి వేరు. కంటెంట్ చాలా వినూత్నంగా ఉండడంతో పాటు, దానికి తగిన విధంగా ఆడియన్స్ ను తమ వైపుకు తిప్పుకోవాలంటే… పబ్లిసిటీ ఖర్చు తలకు మించిన భారంగానే మారుతోంది. బహుశా ఆ ఖర్చునే బహుమతుల రూపంలో అందజేయాలనుకున్నారో ఏమో గానీ, ‘ట్వంటీ ఫస్ట్ సెంచరీ లవ్’ సినిమా నిర్మాతలు ఓ సరికొత్త పంథాను ఎంచుకున్నారు.

‘తమ సినిమాను చూసి, నచ్చలేదని చెప్తే… వారికి లక్ష రూపాయల బహుమానం అందజేస్తామని’ ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రకటించారు. అయితే ప్రకటనలోని ‘టర్మ్స్ అండ్ కండిషన్స్’ సంగతులు తర్వాత చెప్తారనుకోండి. ఇంతకీ ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతోంది అనుకుంటున్నారు… సూపర్ స్టార్ రజనీకాంత్ ‘కబాలి’ సినిమా విడుదలైన మరుసటి రోజు… అంటే జూలై 23వ తేదీన. ‘ట్వంటీ ఫస్ట్ సెంచరీ లవ్’ సినిమా చూసి, నచ్చలేదని సహేతుకంగా వివరిస్తే… లక్ష రూపాయలు బంపర్ ప్రైజ్ కొట్టేసే అవకాశం దక్కుతుంది. ప్రతి సినిమాను వీక్షించి విశ్లేషణ (రివ్యూ)లు అందించే సినీ విశ్లేషకులకు ఓ అవకాశం లభించినట్లే.

ADVERTISEMENT

దర్శక నిర్మాతలు గోపీనాథ్, నరేందర్ లు చేసిన ప్రకటనకు స్పందన ఎలా ఉంటుందో ఈ నెల 23వ తేదీన తేలిపోనుంది. ఇప్పటికే రెండు సార్లు విడుదల తేదీని ప్రకటించి, వాయిదా పడిన ఈ సినిమాలో 30 ఇయర్స్ పృధ్వీ, చిత్రం శ్రీను, జూనియర్ రేలంగి, సుమన్ శెట్టి, నల్ల వేణు తదితరులు కామెడీ పాత్రలు పోషించారు. స్నేహం… ప్రేమ… ఆకర్షణ… నేపధ్యంలో యువతకు సందేశం ఇచ్చే సినిమాగా రూపుదిద్దుకుందని దర్శక నిర్మాతలు ప్రకటించారు.

ADVERTISEMENT
Latest Stories