24 కిస్సెస్… ఈ టైటిల్ పెట్టుకుని ఫ్యామిలీ ఎంటర్టైనర్ తీస్తారని ఎవరూ ఆశించరు. ఆ లవ్ అండ్ రొమాంటిక్ టైటిల్ కు తగ్గట్లుగానే ఫస్ట్ టీజర్ ను విడుదల చేసి ప్రేక్షకుల్లోకి పాజిటివ్ సంకేతాలు పంపింది చిత్ర యూనిట్. గోవా బ్యూటీ ఇలియానా చేతుల మీదుగా “24 కిస్సెస్” ఫస్ట్ టీజర్ ను యూ ట్యూబ్ లో విడుదల చేసారు.
‘ఓ వసంతం… ఓ సుగంధం…’ అంటూ సాగే బ్యాక్ గ్రౌండ్ మెలోడీ సాంగ్ తో హీరో-హీరోయిన్ల మధ్య లవ్ అండ్ రొమాంటిక్ ట్రాక్ ను చూపించారు. జాయ్ అందించిన సంగీతం ఆహ్లాదకరంగా వినసొంపుగా ఉంది. ముఖ్యంగా ‘నీకో సగం… నాకో సగం… ఈ ఉత్సవం…’ అంటూ దర్శకుడు ఏం చెప్పాలనుకుంటున్నాడో పాట ద్వారా స్పష్టంగా తెలియజేసారు.
ఈ పాటకు ‘రామ్ జో’ అందించిన సాహిత్యం, ఆయనలోని రొమాంటిక్ యాంగిల్ ను బయటకు తెచ్చింది. అయితే టైటిల్ ఉన్న “24 కిస్సెస్”లో ఒక్క కిస్ కూడా టీజర్ లో లేకపోవడం విశేషం. అదిత్ అరుణ్, హేబా పటేల్ హీరోహీరోయిన్లుగా నటిస్తుండగా, అయోధ్య కుమార్ కృష్ణంశెట్టి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.



