ఇదేం అడ్డగోలు వాదన మంత్రి గారు?

Pulivendula Gets Better Deal Than Amaravatiస్థానికులకు అన్ని పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు కలిపించే బిల్లు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లో పాస్ అయ్యింది. దీని మీద దేశవ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి. ఇది అనాలోచిత చర్య అని దీని వల్ల అసలు పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ కు రావని చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొందరైతే పక్క రాష్ట్రాలు కూడా ఇటువంటి చట్టాలు చేస్తే అక్కడి పని చేస్తున్న ఆంధ్రావారి పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. సభలో ప్రతిపక్ష టీడీపీ కూడా ఇటువంటి అనుమానాలే వ్యక్తం చేసింది.

అయితే ప్రభుత్వం దీని మీద ఎదురుదాడి మొదలు పెట్టింది. పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకు కల్పించే రిజర్వేషన్‌కు టీడీపీ సభ్యులు అనుకూలమో, వ్యతిరేకమో చెప్పాలని అసెంబ్లీలో మంత్రి అవంతి శ్రీనివాస్ ప్రశ్నించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పరిశ్రమల్లో స్థానికులకు ప్రాధాన్యం కల్పించాలని సూచిస్తే.. అందుకు ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారని అవంతి రొటీన్ గా ఒక డైలాగు కూడా వదిలేశారు. నిజమో కాదో ఎవరికి తెలుస్తది అనే ధీమాతో…!!

ADVERTISEMENT

నిరుద్యోగులకు నెలకు రెండువేల రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి.. ఎన్నికలకు ముందు ఆ హామీని అమలు చేసి.. వారిని చంద్రబాబు మోసగించారని సరిగ్గా ఎన్నికల ముందు టీడీపీ నుండి వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరిన మంత్రిగారు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఈ చట్టం ఏ విధంగా పెట్టుబడులను ప్రోత్సహిస్తుంది? ఒకవేళ ఈ చట్టం ఉన్నా పరిశ్రమలు వచ్చి పెట్టుబడులు పెట్టి 75% స్థానికులకు ఉద్యోగాలు కలిపిస్తే మంచిదే కదా? అలా జరిగితే టీడీపీ గానీ ఇంకొకరుగానీ ఎందుకు స్వాగతించరు?
?

ADVERTISEMENT
Latest Stories