TDP JanaSena BJP YSRCP Congress

ఈ మధ్యకాలంలో రాజకీయ పార్టీల పని తీరు, రాజకీయ నాయకుల ప్రవర్తన చూస్తుంటే పాత కాలం నాటి సామెతలు జ్ఞప్తికి వస్తున్నాయి. వాటిలో కొన్ని…,

* ఇల్లు అలక గానే పండుగ కాదు : కూటమి ప్రభుత్వం.

Also Read – వైసీపీ గతం మూడు రాజధానులు, మరి భవిష్యత్.?

ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగానే సంబరం కాదు, కూటమి పార్టీల మీద ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా పరుగులు పెట్టించాలి. అలాగే ఐదేళ్ల పార్టీ క్యాడర్ పడ్డ మానసిక వేదనకు న్యాయం చెయ్యాలి. ఈ రెండు కార్యక్రమాలను పూర్తి చేసినప్పుడు మాత్రమే కూటమి ప్రభుత్వం దక్కించుకున్న అధికారానికి అర్ధం పరమార్థం ఉంటుంది.

* కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడింది : వైసీపీ పార్టీ.

Also Read – నువ్వు విష్ణువైతే.. నేను గంటా!

వచ్చిన 151 సీట్లకు తృపి పడకుండా వై నాట్ 175 అంటూ విర్రవీగి ఉన్న 151 సీట్లను కూడా పోగొట్టుకుని చివరికి 11 తో సరిపెట్టుకొని ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయింది వైసీపీ పార్టీ.

* గుడ్డొచ్చి పిల్లను వెక్కిరించింది : బిఆర్ఎస్ పార్టీ.

Also Read – హామీలన్నీ అమలు చేసేస్తే మేం దేని కోసం పోరాడాలి బాబూ?

టీడీపీ బలహీనత మీద పునాదులేసుకుని తెరాస గా టీడీపీని భూస్థాపితం చేద్దాం అనుకుంటే బిఆర్ఎస్ గా విలీనం వార్తలతో ఉలిక్కిపడింది బిఆర్ఎస్. టీడీపీ పార్టీ నాయకత్వంతో ఎదిగిన పార్టీ టీడీపీ నే నాశనం చేస్తాను అంటూ కుప్పిగంతులు వేసి బొక్కబోర్లా పడింది.

* అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని : కాంగ్రెస్ పార్టీ.

దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉన్నా, దేశ వ్యాప్తంగా పార్టీకి బలమైన క్యాడర్ ఉన్నా పటిష్టమైన నాయకత్వ లోపం కాంగ్రెస్ పార్టీని అధికారానికి దూరం చేస్తుంది. గాంధీ వారసత్వం, నెహ్రు రాజకీయ నేపథ్యం, సోనియా గాంధీ పర్యవేక్షణ ఉన్నప్పటికీ జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయి విజయాలను అందుకోలేకపోతుంది.

* అదృష్టం దరిద్రం పట్టినట్టు పట్టింది : బీజేపీ పార్టీ.

నిజంగా ఈ సామెత బీజేపీ పార్టీకి సరిగ్గా సరిపోతుంది. ఏపీలో టీడీపీ, జనసేన పార్టీల పొత్తులో కలవడానికి చివరి నిముషం వరకు ఆలోచించిన బీజేపీ ఆఖరి క్షణం లో కూటమిలో భాగస్వామికి అయ్యింది. బీజేపీ తీసుకున్న ఆ ఒక్క నిర్ణయమే కేంద్రంలో మూడోసారి ఎన్డీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యగలిగింది.

* పిల్లగాలి అనుకుంటే పెను తుఫాన్ గా మారింది : జనసేన .

2019 ఎన్నికల ఫలితాలలో కేవలం ఒక్క సీటు గెలుచుకుని పిల్ల సేన, పిల్ల గాలి అంటూ హేళన చేసిన వైసీపీ పార్టీని 2024 ఎన్నికలలో పెను తుఫాన్ గా మారి కబళించేసింది జనసేన.

* అన్ని ఉన్న విస్తరాకు అణిగిమణిగే ఉంటుంది : టీడీపీ పార్టీ.

పటిష్టమైన నాయకత్వంతో, బలమైన క్యాడర్ తో, సమర్ధవంతమైన నాయకులతో బలంగా ఉన్న టీడీపీ పై బురద జల్లి బాబుని అరెస్టు చేసినప్పటికీ టీడీపీ తన బలాన్ని నిరూపించుకుంది. అలాగే ఇప్పుడు అధికారం తన చేతికొచ్చినప్పటికీ ఆచి తూచి ముందుకెళుతుందే తప్ప ఎగిరెగిరి పడడం లేదు.

* దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకోవడం : జగన్.

అధికారం ఉండగానే రాజ భోగాలు అనుభవించి, జిల్లాకో ప్యాలస్ కట్టుకున్నారు.

* కొత్త పిచ్చోడు పొద్దు ఎరుగడని : గుడివాడ అమర్నాధ్.

ఎమ్మెల్యే కే ఎక్కువ అనుకుంటే మంత్రి పదవి కూడా దక్కడంతో వచ్చిన ఆ అధికారంతో కోడి, గుడ్డు అంటూ ఈ సామెతకు పూర్తి న్యాయం చేసారు అమర్నాధ్.

* ముందుండి ముసళ్ల పండుగ : కొడాలి నాని, రోజా, వల్లభనేని వంశీ.

అధికార మదంతో, పదవి మోహంతో గత ఐదేళ్లు పెట్రేగిపోయిన ఈ ముగ్గురికి ఈ సామెత వర్తిస్తుంది.

* చెవిటోడి ముందు శంఖం ఊదినట్టే : జగన్.

తన పార్టీ నేతల మీద ఎన్ని అస్లీల ఆరోపణలు కళ్ళ ముందు సాక్ష్యాలుగా కదలాడుతున్నా చెవిటోడి ముందు శంఖం ఊదినట్టే అన్న చందంగా జగన్ లో ఎటువంటి స్పందన రావడం లేదు.

* ఇంట గెలిచి రచ్చ గెలిచాడు : లోకేష్.

గత ఎన్నికలలో పోటీ చేసిన మంగళగిరిలో ఓడిపోయి వైసీపీ నేతల చేత గోర అవమానాలు ఎదుర్కున్న లోకేష్ ఓడినచోటే భారీ విజయాన్ని సొంత చేసుకుని ఇంట గెలిచి ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలలో చక్రం తిప్పే స్థాయికి చేరాడు.

* పడ్డోడు చెడ్డోడు కాదు : పవన్ కళ్యాణ్.

పవన్ రాజకీయ రంగ ప్రవేశమ చేసిన నాటి నుంచి వ్యక్తిగత విమర్శలతో, ప్యాకేజ్ స్టార్, పెళ్లిళ్ల స్టార్ అంటూ వైసీపీ ఎంత హద్దులు మీరు విమర్శించినా తానూ సహనం కోల్పోలేదు. దాని ఫలితమే నాడు పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయాడు అనే అవమానం నుండి నేడు పార్టీ పోటీ చేసిన అన్ని చోట్ల గెలిపించుకున్నాడు అనే కీర్తిని సంపాదించుకున్నారు.

* పడి లేచిన కెరటం :

40 దశాబ్దాల రాజకీయ అనుభవం, ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా అనూహ్య గుర్తింపు తెచ్చుకున్న చరిత్రను వెనకేసుకొని కూడా వైసీపీ కుటిల రాజకీయానికి ఒక అడుగు వెనక్కి వేసినప్పటికీ పడి లేచిన కెరటం మాదిరి ఉవ్వెత్తున ఎగిసి పడ్డారు బాబు.