బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన ‘సుల్తాన్’ చిత్రం అద్భుతంగా ఉందని, ఈ సినిమా అన్ని రికార్డులను బద్దలు కొడుతుందని మరో అగ్ర హీరో, బాలీవుడ్ ఖాన్ త్రయంలో విలక్షణ హీరో అమీర్ ఖాన్ ప్రశంసలు కురిపించాడు. ఈ మేరకు ట్విట్టర్ లో స్పందించిన అమీర్… “గత రాత్రి ఈ చిత్రాన్ని చూశానని, దర్శకుడు అలీ అబ్బాస్ దర్శకుడిగా, రచయితగా తన సత్తా చాటారని, సల్మాన్, అనుష్క లు అద్భుతంగా నటించారని” చెప్తూ చిత్ర యూనిట్ కు అభినందనలు తెలిపారు.
ఇక ఖాన్ త్రయంలో మరో హీరో షారూఖ్, అమీర్ వ్యాఖ్యలపై స్పందిస్తూ… “మా మధ్య మంచి సంబంధాలున్నాయి. మేం ముగ్గురం చాలా ప్రేమగా ఉంటాం. నా కంటే సల్మాన్, ఆమిర్ పెద్ద స్టార్లని నేను భావిస్తున్నాను. ఆమిర్ చేసిన కామెంట్స్ మేము పరస్పరం గౌరవించుకుంటామని నిరూపించాయి. మా ముగ్గురిలో ఎవరే సినిమా చేసినా పరస్పరం అభినందించుకుంటామని” షారూఖ్ పేర్కొన్నాడు. ఇలా ఖాన్ హీరోలిద్దరూ ఒకరిపై మరొకరు ప్రశంసలతో ముంచెత్తుకోవడం బాలీవుడ్ వర్గాలకు కొత్తగా ఉంది.



