జయాపజయాలతో నిమిత్తం లేకుండా విలక్షణ కధలను ఎంపిక చేసుకుని సినిమాలు చేసే నారా రోహిత్ నుండి తాజాగా రాబోతున్న చిత్రం “ఆటగాళ్ళు.” జగపతిబాబు మరో ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ నుండి టీజర్ వరకు అంతా ఆసక్తికరంగా ఉంది. అలాగే ఇటీవల విడుదలైన ధియేటిరికల్ ట్రైలర్ కూడా సినిమాపై అంచనాలను పెంచే విధంగా ఉంది.
ADVERTISEMENT
ఒక రోజు క్రితం విడుదలైన ఈ ట్రైలర్ కు యూ ట్యూబ్ లో దాదాపుగా 1.5 మిలియన్ క్లిక్స్ కు చేరుకుంది. నారా రోహిత్ వంటి హీరో సినిమాకు ఈ క్లిక్స్ ఎక్కువనే చెప్పాలి. దీంతో ఈ సినిమా పట్ల నెటిజన్లలో ఎంత క్రేజ్ ఉందో చెప్పడానికి నిదర్శనంగా ఈ క్లిక్స్ నిలుస్తున్నాయి. వీక్షకుల అంచనాలను ట్రైలర్ అందుకోవడం, క్లిక్స్ ఈ రేంజ్ లో ఉండడంతో చిత్ర యూనిట్ ఫుల్ ఖుషీగా ఉంది.
ADVERTISEMENT



