“ప్రభాస్ పెళ్లి శుభలేఖ” – నిండుగా ఉంది!

aavu puli madhyalo prabhas pelli movie“బాహుబలి” సినిమాలో ‘కిలికిలి’ భాషతో పాపులర్ అయిన ప్రభాకర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం “ఆవు పులి మధ్యలో ప్రభాస్ పెళ్ళి.” ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. పెళ్ళికొడుకు గెటప్ లో ఉన్న ప్రభాకర్ లుక్ తో పాటు సినిమా టైటిల్ తో కూడిన పెళ్లి శుభలేఖ సినిమాపై ఆసక్తిని కలిగిస్తోంది. అంతా కొత్తవారితో రూపొందుతున్న ఈ సినిమాలో ‘కిలికిలి’ ప్రభాకర్ ఒక్కడే ప్రేక్షకులకు సుపరిచితం.

నటుడిగా ప్రభాకర్ కు మరో మెట్టు అయినప్పటికీ, ప్రేక్షకులను ధియేటర్లకు రప్పించే సత్తా ప్రభాకర్ వద్ద ఉందా అన్నది ప్రశ్నార్ధకమే. గతంలో క్యారెక్టర్ ఆర్టిస్టు అజయ్ కూడా ఒకటి, అర సినిమాలలో ప్రధాన పాత్రలు పోషించి, మళ్ళీ యథావిధిగా క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలలో కనిపిస్తున్నారు. మరి ప్రభాకర్ పరిస్థితి ఏమవుతుందో…!

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories