విజయాన్ని అందించని రీ ఎంట్రీస్…

Actress Laya Re-Entry

ఈ మధ్య కాలంలో టాలీవుడ్లో ఒకప్పటి అందాల భామల రీ ఎంట్రీస్ ట్రెండ్ నడుస్తుంది. సందీప్ కిషన్, రావు రమేష్ నటించిన మజాకా మూవీ తో నాగార్జున ‘మన్మధుడు’ మూవీ హీరోహిన్ ‘అన్షు’ చాల కాలం తరువాత వెండి తెరమీదకు రీ ఎంట్రీ ఇచ్చారు.

రీ ఎంట్రీ ఇస్తేనే కదా ప్రేక్షకులు ఆదరించేది లేనిది తెలుస్తుంది అన్నట్టుగా మొదలైన ఈమె రీ ఎంట్రీ అన్షు కి ఊహించిన స్థాయి విజయాన్ని అందించలేకపోయింది. ఇక ఆ తరువాత ఎన్టీఆర్ ‘ఆది’ చిత్రంలో కథానాయిక మెప్పించిన ‘కీర్తి చావ్లా’ చాల గ్యాప్ తరువాత విశ్వక్ సేన్ లైలా మూవీ తో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.

ADVERTISEMENT

అయితే లైలా డిజాస్టర్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచింది అనేలా ఆ మూవీ రిజల్ట్ హీరో విశ్వక్ ను క్షమాపణలు కోరే స్థాయికి తెచ్చింది. దీనితో ఒకప్పటి టాలీవుడ్ హీరోహిన్ రీ ఎంట్రీ అపజయంతోనే మొదలయ్యింది.

ఇక తాజాగా విడుదలైన నితిన్ తమ్ముడు సినిమా కోసం ఒకప్పుడు బెస్ట్ హీరోహిన్ గా ఉమ్మడి ఏపీ ప్రభుత్వం నుంచి రెండు నంది అవార్డులు అందుకున్న తెలుగు నటి ‘స్యయవరం’ లయ రీ ఎంట్రీ ఇచ్చారు. ఎన్నో అంచనాలతో, మరెన్నో ఆశలతో మూవీ లోని హీరో నితిన్ అక్కగా మెయిన్ క్యారెక్టర్లో నటించిన ‘లయ’ కు కూడా చేదు అనుభవమే ఎదురయ్యింది.

నితిన్ తమ్ముడు చిత్రం నితిన్ కెరీర్ లోనే ప్లాప్ టాక్ ను దక్కించుకుంది. దీనితో ఒకప్పటి హీరోహీన్స్ కి ఇప్పుడు రీ ఎంట్రీస్ తో అపజయాలు ఎదురవుతున్నాయి అనే సెంటిమెంట్ ఏర్పడింది. అయితే ఇక తాజాగా విడుదలకు సిద్దమయిన హీరో సుహాస్ మూవీ తో మరో అందాల తార క్యారెక్టర్ ఆర్టిస్టుగా తెరమీద ప్రత్యక్షం కాబోతున్నారు.

దర్శకుడు తేజ ‘నువ్వు నేను’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ‘అనిత’ ఇప్పుడు ‘ఓ భామ అయ్యో రామ’ మూవీ తో సెకండ్ ఇన్నింగ్స్ షురూ చేసారు. మరి అనితకైనా ఈ రీ ఎంట్రీ సెంటిమెంట్ తప్పుతుందా.? విజయం వరిస్తుందా.? అనేది చూడాలి.

ADVERTISEMENT
Latest Stories