అరంగేట్రం బాగున్నా అదృష్టం బాలేదా.?

Srinidhi Shetty Sruti Marathe Rukmini Vasanth

రంగుల ప్రపంచంలో ఎదగాలని, వెండితెర మీద ఒక వెలుగు వెలగాలని, అవకాశాల కోసం ఎంతోమంది సినీ ఇండస్ట్రీ తలుపు తడతారు. అయితే ఇందులో ఆ అవకాశం దక్కించుకునే అదృష్టవంతులు చాల కొద్దీ మంది మాత్రమే ఉంటారు.

అయితే అవకాశం వచ్చినా దాన్ని నిలబెట్టుకుని రాణించగలిగిన నటీ నటులు చాల అరుదుగా కనిపిస్తారు. ఇందులో మరి ముఖ్యంగా ఈ గ్లామర్ ఫీల్డ్ లో హీరో హిన్ గా నిలదొక్కుకోవడం అంటే అది ఒక సాహసంతో కూడిన యాత్రనే చెప్పాలి.

ADVERTISEMENT

ఈ పోటీ ప్రపంచంలో అవకాశం దక్కించుకోవడం అనేది ఒక వరం అయితే దాన్ని నిలబెట్టుకుని, కొనసాగించగలగడం ఒక అదృష్టమనే చెప్పాలి. అయితే ఒక్కో సారి ఆ ఒక్క ఛాన్స్ పలకరించి విజయాన్ని కట్టబెట్టిన దాన్ని కొనసాగించలేక వెండితెరకు దూరమవుతున్న తారలు మరెందరో.

వారిలో ముఖ్యంగా పాన్ ఇండియా స్థాయిలో బాక్స్ రికార్డుల వేట కొనసాగించి, థియేటర్లను దద్దరిల్లే చేసిన సినిమాలలో నటించిన నటీమణికి మారో అవకాశం దక్కకపోవడాన్ని ఏమనాలి.? ఇది ఆమె దురదృష్టమా.? లేక తన చేతకాని తనమా.? ఈ ఉపోద్ఘాతం అంతా కూడా కెజిఫ్ హీరోహిన్ శ్రీనిధి రమేష్ శెట్టి అదృష్టం గురించే. కెజిఫ్ – పార్ట్ 1,2 రెండు సినిమాలలో అవకాశం అందుకున్న ఈ అమ్మడు మరో అవకాశాన్ని దక్కించుకోలేకపోయారు.

కెజిఫ్ తో ఆ మూవీ లో నటించిన యష్, ఆ సినిమా దర్శకుడు ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా స్టార్ లుగా క్రెజ్ దక్కించుకున్నారు కానీ శ్రీనిధికి మాత్రం మరో అవకాశం కూడా రాబట్టుకునే గుర్తింపు కూడా దక్కలేదు. అలాగే రీసెంట్ బాక్స్ ఆఫీస్ హీరోగా నిలిచిన దేవర సినిమాలో పెద్ద ఎన్టీఆర్ పాత్రకు హీరోహిన్ గా నటించిన శృతి మరాఠే పేరు కూడా సగటు సాధారణ ప్రేక్షకుడికి తెలియదంటే ఆశ్చర్యం కాకమానదు.

దేవర విజయం మొత్తం గంపగుత్తగా హీరో ఎన్టీఆర్ ఖాతాలో జమైపోయింది కానీ ఆ పాత్రకు హీరోహిన్ గా చేసిన నటీ పేరు మాత్రం ఎర్ర సంద్రంలో కలిసిపోయిందనే చెప్పాలి. ఇక సప్త సాగరాలు అంటూ సైలెంట్ గా వచ్చి అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్న రుక్మిణి పరిస్థితి కూడా ఇంచుమించు ఇదే విధంగా ఉంది.

వీరందరూ కూడా తమ మొదటి అడుగుతోనే వెండి తెర మీద అనూహ్య విజయాన్ని అందిపుచ్చుకున్నప్పటికీ, బాక్స్ ఆఫీస్ మోత మోగించినప్పటికీ వారికీ అవకాశం మాత్రం ఒక్కటంటే ఒక్కటే అన్నట్టుగా మారిపోయింది. దీనితో అరంగేట్రం బాగున్నా అదృష్టం లేకుండా పోయిందే అంటూ ఈ ముద్దుగుమ్మల అదృష్టం మీద జాలి చూపించడమే సరి.

ADVERTISEMENT
Latest Stories