‘హార్ట్ ఎటాక్’ సినిమాతో టాలీవుడ్ నాట అడుగుపెట్టిన ఆదాశర్మకు ‘క్షణం’ ద్వారా ఒక బ్రేక్ వచ్చింది. కానీ సబ్జెక్ట్ ఓరియెంటెడ్ మూవీ కావడంతో, ఆదాకు ఆఫర్లు మాత్రం రాలేదు. తెలుగు సినిమాలు లేకపోయినా, ప్రేక్షకులకు, నెటిజన్లకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ, తన లేటెస్ట్ ఫోటోస్ అండ్ వీడియోలను పోస్ట్ చేస్తూ సోషల్ మీడియాలో ఎప్పుడూ సందడి చేస్తుంటుంది.
అందులో భాగంగానే ఈ సమ్మర్ సెగలో బికినీ ఎలా ధరించాలో అంటూ ఓ రెండు సూత్రాలను తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వివరించింది. అందులో మొదటిది ఏమిటంటే… బికినీ తెచ్చుకోవడం.., రెండవది ధరించడం…! కాస్త ఎటకారంగా ఉన్నా, ఈ రెండూ సూత్రాలను చెప్తూ… తాను బికినీ ధరించిన ఓ హాట్ పిక్ ను పోస్ట్ చేసింది ఆదా. సమ్మర్ స్పెషల్ గా కాస్ట్యూమ్స్ ను ఎలా ‘ఆదా’ చేస్తోందో ఈమెను చూసే నేర్చుకోవాలంటూ నెటిజన్లు చమత్కరిస్తున్నారు.
ADVERTISEMENT
ADVERTISEMENT



