“మనోడి సినిమా మినిమం గ్యారెంటీ ఉంటుంది, థియేటర్లో చూడొచ్చు” అని పేరు సంపాదించుకున్న అతికొద్దిమంది యువ కథానాయకుల్లో అడివి శేష్ ఒకడు. తన సినిమాలన్నిటికీ తానే కథలు రాసుకోవడం, దర్శకత్వ శాఖలోనూ ఇన్వాల్వ్ అవ్వడంతో శేష్ మీద, శేష్ సినిమాల మీద మంచి నమ్మకం ఏర్పడింది ప్రేక్షకులకి. ఆ నమ్మకం తాలుకు ఎఫెక్ట్ బాక్సాఫీస్ లెక్కల్లో కనిపిస్తూనే ఉంటుంది. “క్షణం” నుండి “మేజర్” వరకు శేష్ చేసిన అన్నీ సినిమాలు హిట్లే.
అయితే.. ఓ మూడేళ్ల విరామం అనంతరం శేష్ రచించి, నటించిన సినిమా “డెకాయిట్” ఈ శుక్రవారం (ఏప్రిల్ 10) విడుదలకు సిద్ధమైంది. విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ & ట్రైలర్ డీసెంట్ గా ఉన్నా.. ఎందుకో సినిమాకి కావాల్సిన హైప్ క్రియేట్ చేయలేకపోయింది. శేష్ కూడా హైదరాబాద్, ముంబైలో ఉన్న అన్ని మీడియా హౌజ్ లకి తిరుగుతూ ఇంటర్వ్యూలు ఇవ్వడం పాడ్ క్యాస్ట్ లు చేయడం గట్రా చేసినప్పటికీ, ఎందుకో సినిమాకి రావాల్సినంత బజ్ రావడం లేదు.
ఈ ఎఫెక్ట్ ఓపెనింగ్స్ మీద పడుతుంది అనే విషయంలో శేష్ కి కూడా క్లారిటీ ఉంది. అందుకే మొన్నటి ఈవెంట్లో ఆ విషయమై ప్రశ్నించగా, తాను అవన్నీ పట్టించుకోనని సమాధానమిచ్చాడు. అయితే.. ఇప్పటివరకు వచ్చిన శేష్ అన్ని సినిమాలకంటే “డెకాయిట్” బడ్జెట్ ఎక్కువ, ప్రీరిలీజ్ బిజినెస్ & ఓటీటీ, డిజిటల్ రైట్స్ వంటివన్నీ మంచి రేటుకే అమ్ముడైనప్పటికీ, హీరో రేంజ్ ని నిరూపించే ఓపెనింగ్స్ & కలెక్షన్స్ విషయంలో మాత్రం డెకాయిట్ వెనుకంజలోనే ఉంది.
ఆఖరికి మృణాల్ ఠాకూర్ క్రేజ్ కూడా ఈ సినిమాకి బజ్ తీసుకురావడంలో ఉపయోగపడడం లేదు. ఆమె ప్రమోషన్లకి కాస్త దూరంగా ఉంటుంది అనుకోండి. సో, ఏప్రిల్ 9న ఓవర్సీస్ ప్రీమియర్స్ & 10వ తారీఖున ఇండియాలో వచ్చే రెస్పాన్స్ బట్టి సినిమా రిజల్ట్ ఏంటి అనేది తెలుస్తుంది.






