బాలీవుడ్ మేధావులు ఇప్పుడు ఏం అంటారో చూడాలి

ahan shetty tara sutaria RX 100 bollywood remakeకబీర్ సింగ్ – తెలుగు బ్లాక్ బస్టర్ అర్జున్ రెడ్డి బాలీవుడ్ రీమేక్ ఇటీవలే విడుదలై భారీ విజయం నమోదు చేసుకుంది. అయితే బాలీవుడ్ క్రిటిక్స్ ఆ సినిమాను తూర్పారబట్టారు. మహిళ ఆత్మగౌరవాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి అతివ అంటే ఆటవస్తువుగా చిత్రీకరించారని, సినిమా దర్శకుడికి మహిళలంటే కనీస గౌరవం లేదని వారి ఆరోపణ. అయితే వారి వాదనలను తోసిరాజని ప్రేక్షకులు ఆ సినిమాకు నీరాజనం పట్టారు. బాలీవుడ్ లో ఈ ఏడాది అతి పెద్ద హిట్ గా నిలిచింది కబీర్ సింగ్.

మరోవైపు తెలుగులో బ్లాక్ బస్టరైన ఆర్ఎక్స్ 100 ఇప్పుడు బాలీవుడ్ లో రీమేక్ అవుతుంది. సీనియర్ నటుడు సునీల్ శెట్టి కుమారుడు అహాన్ శెట్టి ఈ సినిమాతో తెరంగేట్రం చేస్తున్నాడు. ఈరోజు ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్తుంది. మిలన్ లూథరియా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. తారా సుతారియా హీరోయిన్ గా నటిస్తుంది. సౌత్ ముంబైలోని ఒక సినిమా థియేటర్ లో షూటింగ్ మొదలయ్యింది. సినిమా మేజర్ భాగం ముస్సోరిలో షూటింగ్ జరుపుకోబోతుంది.

ADVERTISEMENT

అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే అర్జున్ రెడ్డికి ఆపోజిట్ ఆర్ఎక్స్ 100. ఒక యువతి తన ప్రేమికుడిని మోసం చెయ్యడం ఈ సినిమా సారాంశం. స్త్రీ హక్కుల కోసమంటూ కబీర్ సింగ్ ను విమర్శించిన బాలీవుడ్ క్రిటిక్స్ ఇప్పుడు స్త్రీ ఉన్మాదాన్ని తప్పు పడతారో లేదో చూడాలి. ఒకవేళ అలా చెయ్యకపోతే వారి పక్షపాతం బయటపడుతుంది. 2020 మొదట్లో హిందీ ఆర్ఎక్స్ 100 ప్రేక్షకుల ముందుకు వస్తుంది. హిందీలో ఈ సినిమాకు తడప్ అనే పేరు పరిశీలనలో ఉంది.

ADVERTISEMENT
Latest Stories