AI … అద్భుతాలు..!

AI Political Video

టెక్నాలజీ పెరిగే కొద్దీ వాటి వినియోగం కూడా పెరుగుతూనే ఉంటుంది. అయితే ఆ టెక్నాలజీ ని కొందరు అస్లీలతకు వినియోగిస్తే మరికొందరు అద్భుతాలు చేయడానికి వాడుకుంటున్నారు. ప్రస్తుతం ప్రపంచం మొత్తం AI టెక్నాలజీ వాడకంతో బిజీ బిజీగా ఉంది.

అయితే ఈ మధ్యకాలంలో AI వీడియో లు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. సినీ సెలబ్రెటీల నుంచి రాజకీయ నాయకుల వరకు అందరు కలిసి ఒకచోట కూర్చుని సరదగా కబుర్లు చెప్పుకుంటున్నట్టు, సెలబ్రేషన్స్ చేసుకుంటున్నట్టు రూపొందిన కొన్ని వీడియోలు ఆయా స్టార్ అభిమానులకు ఆనందాన్ని, ఆయా పొలిటికల్ లీడర్ల మద్దతుదారులకు ఆర్చర్యాన్ని కలిగిస్తున్నాయి.

ADVERTISEMENT

ఇప్పుడు అటువంటిదే ఒక వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. పొద్దునలేస్తే ఉప్పు – నిప్పు మాదిరి కొట్టుకునే టీడీపీ, వైసీపీ కలిసి సైకిల్ మీద కబుర్లు చెప్పుకుంటే, అలాగే పచ్చగడ్డి వేసిన భగ్గున మండిపోయే జనసేన – వైసీపీ గాజు గ్లాసులో టీ తాగుతుంటే,

ఇక నది – నీళ్లు అంటూ నిత్యం నిప్పులు కక్కునే బిఆర్ఎస్ – టీడీపీ అలా గులాబీ కారులో షికారుకెళ్తే, అలాగే నువ్వెంతంటే నువ్వెంత అంటూ పొట్టేళ్ల మాదిరి పోట్లాడుకునే బిఆర్ఎస్ – కాంగ్రెస్ చేయి చేయి పట్టుకుని సరదాగ ఫ్యాన్ కింద కబుర్లు చెప్పుకుంటే…చూడడానికి ఎలా ఉంటుంది అనేది వాస్తవ జీవితంలో సాధ్యం కాకపోయినప్పటికీ AI తో సాధ్యం అని నిరూపించారు.

AI టెక్నాలజీ వాడుకుని కొంతమంది బాబు, పవన్, జగన్, లోకేష్, కేసీఆర్, కేటీఆర్, రేవంత్ అందరు కలిసి ఒక చోట చేరి ఈ సంక్రాంతి వేడుకలు జరుపుకుంటే ఎలా ఉంటుందో అనేదాని పై ఒక వీడియో సృష్టించారు. అయితే ఆ వీడియో చూడడనికి రెండు కళ్ళు చాలవు అన్నట్టుగా అద్భుతంగా ఉంది అంటున్నారు ఆయా పార్టీల మద్దతుదారులు.

మరి ఇటువంటి దృశ్యాలు వాస్తవ జీవితంలో చూడడానికి సాధ్యం కదుకాబట్టే ఇటువంటి వీడియోలను అద్భుతాలుగా చిత్రీకరిస్తున్నారు ఆయా పార్టీల అభిమానులు. మరి రాజకీయాలకు అతీతంగా ఇటువంటి అద్భుతాలు ఎదో ఒకనాటికి వాస్తవ రూపంలో కూడా చూడాలని ఆశిద్దాం..!

ADVERTISEMENT
Latest Stories