అఖిల్ ఎలివేషన్ అదిరింది!

Akhil akkineni Elevationఅక్కినేని అఖిల్ హీరోగా నటిస్తోన్న మూడవ సినిమా ఇటీవల ప్రారంభమైన విషయం తెలిసిందే. ‘తొలిప్రేమ’ ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం విదేశాల్లో జరుగుతుండగా, అప్ డేట్స్ ను ‘షూటింగ్ డైరీస్’ పేరుతో ప్రతి రోజు అఖిల్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా అందిస్తున్నారు. అందులో భాగంగా తాజాగా చిత్ర సినిమాటోగ్రాఫర్ తీసిన ఓ వీడియో షాట్ ను అఖిల్ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయగా, సీన్ అదిరిందంటూ నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

సినిమాలలో హీరో ఇంట్రడక్షన్ షాట్ మాదిరి… ముందుగా షూస్ నుండి హెడ్ వరకు ఎలివేట్ చేస్తూ తీసిన ఈ షాట్ నిజంగానే బాగుంది. బహుశా సినిమాలో పెట్టినా అద్భుతంగా ఉందంటూ ఫ్యాన్స్ పండగ చేసుకునేలా ఉంది. అఖిల్ మొబైల్ తో కెమెరామెన్ సునీల్ ఈ షాట్ ను చిత్రీకరించాడు. కూల్ గా కనపడుతోన్న ఈ సీన్ ను ఇచ్చినందుకు గాను సునీల్ కు కృతజ్ఞతలు తెలిపాడు అఖిల్. ‘సవ్యసాచి’లో చైతూ సరసన హీరోయిన్ గా నటిస్తోన్న నిధి అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్ గా కన్నులవిందు చేయనుంది.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories