అఖిల్, చైతూ ఇద్దరివీ ‘బంగార్రాజు’ క్యారెక్టర్లే!

akhil-and-chaitanya-are-like-bangarraju-characterపంచెకట్టులో అక్కినేని ముగ్గురు మొనగాళ్ళు ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రస్తుతం మీడియా వర్గాల్లో హల్చల్ చేస్తోంది. పండగ పర్వదినాన ఇచ్చిన ఇంటర్వ్యూ లో “సోగ్గాడే చిన్నినాయనా” సినిమా విశేషాలతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణంలో వ్యక్తిగత విషయాలను ప్రస్తావించారు.

“అఖిల్ వాళ్లమ్మ ముందు రామూలా ఉంటాడని, అలాగని వాడు రామూ కాదని బయటికెళ్లాక బంగార్రాజేనని, నాగచైతన్య విషయానికి వస్తే, వాడు మనసులో బంగార్రాజు కానీ, బయటకి మాత్రం రామూలా కనిపించేందుకు కష్టపడుతుంటాడని” చెప్పిన మాటలు అభిమానుల చేత నవ్వులపూలు పూయిస్తున్నాయి. నాగ్ ఈ వ్యాఖ్యలు చేస్తున్న సమయంలో అఖిల్, నాగచైతన్య ఇద్దరూ కూడా తలవంచుకుని తెగ నవ్వుకున్నారు. అయితే వాళ్లు బయట ఎలా ఉన్నా తన ముందు మాత్రం రామూలా కనిపిస్తే చాలని నాగార్జున చెప్పారు.

ADVERTISEMENT

ఈ సినిమాలో ‘బంగార్రాజు’ పాత్రకు స్ఫూర్తి ‘దసరాబుల్లోడు’ సినిమా అని, ఆయనలా పంచెకట్టి నటించాలని కోరిక బలంగా ఉండేదని, ‘అల్లరి అల్లుడు’లో నటించినప్పటికీ ఇలాంటి పంచె మాత్రం కట్టలేదని నాగార్జున తెలిపారు. ‘ప్రెసిడెంట్ గారి పెళ్లాం’ సినిమాలో ‘దసరాబుల్లోడు’ సినిమా పంచెకట్టుకట్టానని, ఈ సినిమాలో కనిపించినది మాత్రం తన తండ్రి సాధారణంగా ఇంట్లో కట్టే పంచెకట్టు అని కింగ్ ‘బంగార్రాజు’ పాత్ర గురించి చెప్పుకొచ్చారు.

“సోగ్గాడే చిన్నినాయనా” సినిమాలో తమకు నచ్చిన పాత్ర కూడా అదేనని ఈ సందర్భంగా చైతూ, అఖిల్ చెప్పారు. కింగ్ కొడుకులుగా వారిద్దరికీ నచ్చడమే కాదు, ఈ సినిమాలో ఇతర అంశాలు నచ్చినా, లేకున్నా ‘బంగార్రాజు’ పాత్ర మాత్రం ప్రతి ఒక్కరి చేత ప్రశంసలు అందుకుంటోంది. ఆ పాత్రలో నటించిన నాగ్ నటనకు విమర్శకులు కూడా నీరాజనం పలుకుతున్నారు.

ADVERTISEMENT
Latest Stories