ఆంధ్రప్రదేశ్ రాజకీయ వేదిక పై సీనియర్ నాయకుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎల్లప్పుడూ సవాళ్లను ఎదుర్కొంటూ, వాటిని అవకాశాలుగా మలచుకోవడంలో సిద్ధహస్తుడు అని మరోసారి నిరూపించుకుంటున్నారు.
అయితే, ప్రస్తుతం ఏపీలో నెలకొన్న పరిస్థితులు ఆయన పరిపాలనా దక్షతకు, రాజకీయ చతురతకు మరోసారి పెద్ద పరీక్షగా మారాయి. ఒకవైపు ప్రకృతి సృష్టించిన విపత్తులు, రాజకీయ సమీకరణాలు తలుపు తడుతుంటే… మరోవైపు రాష్ట్రంలోని స్థానిక సంస్థల ఎన్నికల సమరం ఆయన ముంగిట నిలిచింది.
ఒకవైపు “అర్నాబ్, మురసు” తుపాన్ల సవాళ్లు:
ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన ప్రతిసారి బాధితులకు అండగా నిలవడంలో చంద్రబాబు మార్క్ పరిపాలన స్పష్టంగా కనిపిస్తుంది. ఇటీవల తీరాన్ని తాకిన తీవ్ర తుపాన్ల (అర్నాబ్, మురసు) తీవ్రత వల్ల తీరప్రాంత జిల్లాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది.
వర్షాల దాటికి పంటలు నష్టపోయిన రైతులు, ముంపునకు గురైన ప్రజలను ఆదుకోవడానికి ప్రభుత్వం తక్షణ సహాయక చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి స్వయంగా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి, సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షించడం, పరిపరి విధాల నష్టపరిహారం అందించి ప్రజల్లో ధైర్యం నింపడం ఆయన అత్యంత ప్రాధాన్యతగా మారింది. ప్రకృతి కోపానికి గురైన ప్రజల కష్టాలను తీర్చడం పరిపాలనాపరంగా బాబు ముందున్న అతిపెద్ద సవాలు.
ఇక మరోవైపు “స్థానిక సమరం”:
ఈ విపత్తుల నడుమనే మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల పోరు కాకరేపుతోంది. మునిసిపాలిటీలు, కార్పొరేషన్లు, జడ్పీటీసీ, ఎంపీటీసీ వంటి స్థానిక సంస్థల్లో గెలుపు కూటమి ప్రభుత్వానికి ఎంతో ప్రతిష్ఠాత్మకం. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఈ ఎన్నికలు ఒక రకంగా ప్రజాతీర్పు లాంటివి.
దీంతో ఒకవైపు ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొడుతూ, మరోవైపు కూటమి శ్రేణులను ఎన్నికల బరిలో ఉసిగొల్పుతూ, విజయం దిశగా అడుగులు వేయాల్సిన గురుతర బాధ్యత చంద్రబాబుపై పడింది. అలాగే కూటమి ప్రభుత్వంలో భాగమైన మూడు పార్టీల మధ్య సీట్ల పంచాయితీ కూడా బాబు కి అదనంగా తోడైన మరొకావిడ బిందనే చెప్పాలి.
బ్యాలెన్స్ బాబు: పరిపాలన – రాజకీయం రెండూ సమన్వయం!
ఇక్కడే చంద్రబాబు తన సుదీర్ఘ అనుభవాన్ని ప్రకటిస్తున్నారు. ఒకవైపు ముంపు ప్రాంతాల ప్రజలకు త్వరితగతిన పునరావాసం కల్పించడం, మౌలిక వసతుల పునరుద్ధరణ వంటి పనులతో పరిపాలనను పరుగులు తీయిస్తూనే… మరోవైపు ఎన్నికల వ్యూహాలను రచిస్తూ పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేస్తున్నారు.
ఒక చేత్తో ప్రకృతి సృష్టించిన సంక్షోభ నివారణ, మరో చేత్తో స్థానిక ఎన్నికల్లో కూటమి విజయానికి వ్యూహరచన… ఈ రెంటినీ సమతుల్యం చేస్తూ చంద్రబాబు ముందుకు సాగుతుండటమే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. సంక్షోభ నిర్వహణలో తనకు సాటిలేరని నిరూపించుకుంటూనే, సమరంలోనూ జెండా పాతేందుకు ఆయన వేస్తున్న అడుగులు ‘బాబు బ్యాలెన్సింగ్ రాజకీయానికి’ అద్దం పడుతున్నాయి.





