వందల కోట్ల డబ్బులు అకౌంట్లో ఉండొచ్చు, వేల కోట్ల ఆస్తులు ఉండొచ్చు. కానీ.. వీటన్నిటికీ మించింది పుత్రోత్సాహం. దానికోసం పరితపించిన తండ్రి ఉండడు. అందుకు తాజా ఉదాహరణలు మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జునలే.
రామ్ చరణ్ ఆల్రెడీ స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ అయిపోయినా.. ఇప్పటికీ చిరంజీవి ప్రతి విషయంలోనూ చరణ్ ను గైడ్ చేస్తూనే ఉంటాడు. స్టోరీ నెరేషన్ నుండి సక్సెస్ మీట్ వరకు.. ప్రతిదాంట్లో చిరంజీవి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఒక్కోసారి అది అతిజాగ్రత్త అనిపించినప్పటికీ.. తండ్రిగా ఆయన ప్రేమను తప్పు పట్టలేం.
అయితే.. నాగార్జున మాత్రం అందుకు పూర్తిగా రివర్స్. తన కొడుకులిద్దరికీ బడా డైరెక్టర్ తో ప్రాజెక్ట్స్ సెట్ చేయగల సత్తా ఉన్నప్పటికీ.. వాళ్ల కెరీర్లో ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వకుండా సైలెంట్ గా చూస్తూ ఉంటాడు. హిట్ కొడితే మాత్రం తెగ మురిసిపోతాడు నాగ్. నిన్న అఖిల్ ను హత్తుకొని కన్నీటి పర్యంతం అవ్వడమే అందుకు నిదర్శనం.
అఖిల్ కెరీర్ మొత్తంలో నాగార్జున బీభత్సంగా ఇన్వాల్వ్ అయ్యి చేసిన సినిమాలు “అఖిల్, హలో, లెనిన్”. అఖిల్ ఆడకపోవడానికి కారణం అవుట్ పుట్ ఇష్యూ, హలో ఏమో నాని ఎంసీఏతో పోటీ పడి కనిపించకుండపోవడం. అందుకే “లెనిన్” విషయంలో మాత్రం చాలా కేర్ ఫుల్ గా ఉన్నాడు నాగ్. దాని రిజల్ట్ ఏమిటి అనేది అందరికీ ఈపాటికే తెలిసొచ్చింది.
ఈ విధంగా చరణ్ కి చిరు గైడెన్స్ కాస్త బోర్డర్ దాటుతుంది అనిపించినా, అఖిల్ విషయంలో నాగ్ ఇంకాస్త ఎక్కువ ఇన్వాల్వ్ అయితే బాగుంటుంది అనిపించినా.. తండ్రుల ప్రేమను చూసి మురిసిపోవడం మాత్రం ఖాయం.
అయితే.. ఇలా పుత్రోత్సాహం పొందే అవకాశం మాత్రం మోక్షజ్ఞ తండ్రి బాలకృష్ణకి ఇవ్వడం లేదు. హీరోగా మొదలవ్వాల్సిన సినిమా నుండి తప్పుకోవడం, ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడో క్లారిటీ లేకపోవడం అనేది నందమూరి అభిమానులకు ఎక్కడలేని నిరాశ కలిగించే విషయం.



