హాట్ హాట్ : ‘అక్కినేని బ్రదర్స్’ ఎంగేజ్మెంట్?

Naga Chaitanya Akhil Akkineni Marriage, Naga Chaitanya Akhil Akkineni Engagement,Naga Chaitanya Akhil Samantha, Naga Chaitanya Akhil Lover టాలీవుడ్ లో సమంత చెప్పిన ఒక చిన్న ‘సీక్రెట్’ పెను సంచలనానికి కారణమైంది. ‘తను ఒకర్ని ప్రేమిస్తున్నానని, అతని పేరులోని మొదటి అక్షరం ‘ఎన్’ పేరుతో ప్రారంభమవుతుందని’ చెప్పిన కబుర్లతో అందరి చూపులు నాగచైతన్య వైపుకు తిరిగాయి. ఆ తర్వాత ఫోటో లీక్ కావడం వీటికి మరింత బలాన్ని ఇచ్చింది. ఇలా చైతూ – సమంతల విషయం ఓ కొలిక్కి రాకముందే… మరో అక్కినేని వారసుడు అఖిల్ ప్రేమ విషయం మరో చర్చకు దారి తీసింది.

న్యూయార్క్ లో చదువు పూర్తి చేసుకుని డిజైనర్ గా పనిచేస్తున్న శ్రేయా భూపాల్ తో అఖిల్ ప్రేమలో ఉన్నారన్న వార్తలు గుప్పుమన్నాయి. ఈ వార్తలు ఇక్కడితో ఆగితే ఏముంది… ఏకంగా త్వరలో అఖిల్ ఎంగేజ్మెంట్ కూడా జరిగిపోతుందన్న ప్రచారం టాలీవుడ్ వర్గాల్లో జరుగుతోంది. అయితే పెద్ద కొడుకు చైతూ పెళ్లి చేయకుండా అఖిల్ వివాహ ముహూర్తం నిర్ణయించడం సాధ్యం కాదు గనుక, ముందుగా చైతూ విషయాన్ని కూడా ఫ్యామిలీ ఓ కొలిక్కి తెస్తుందని టాక్.

ADVERTISEMENT

ఈ పరిణామాలతో ‘అక్కినేని బ్రదర్స్’ ఎంగేజ్మెంట్ ఒకేసారి జరిగినా ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదని ప్రచారం జరుగుతోంది. ఈ వార్తల్లో ఎంత వాస్తవముందో గానీ, చైతూ – అఖిల్ ల ప్రేమ వ్యవహారం టాలీవుడ్ లో పెద్ద ఎత్తున చర్చలకు తెరలేపింది. అయితే తండ్రి నాగ్ – అమలది ప్రేమ వివాహం కావడంతో… కొడుకుల లవ్ మ్యాటర్ కు పెద్దగా ఇబ్బందులు ఎదురు కాకపోవచ్చన్నది మరో మాట.

ADVERTISEMENT
Latest Stories