ఇటీవల ముంబై ఎయిర్ పోర్టులో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ తో ఓ సెల్ఫీ కోసం ప్రయత్నిస్తోన్న అభిమానిపై అక్షయ్ బాడీగార్డ్ చేయిచేసుకున్న విషయం మీడియా వర్గాలలో హాట్ టాపిక్ గా ప్రసారం కావడంతో… తాజాగా దీనిపై వివరణ ఇచ్చుకున్నాడు అక్షయ్. ట్విట్టర్ లో స్పందిస్తూ… ఈ ఘటనపై చింతిస్తున్నానని, తన అభిమానిని క్షమాపణలు కోరుతున్నానని చెప్పాడు.
“అభిమానిపై చేయి చేసుకున్న బాడీగార్డ్ ను హెచ్చరించానని, అభిమానులపై తన బాడీగార్డ్ లు దురుసుగా ప్రవర్తించకుండా మున్ముందు జాగ్రత్త పడతానని” సర్ది చెప్పుకునే ప్రయత్నం చేసాడు. నిజానికి ఘటన జరిగిన రోజు ఈ విషయాన్ని గమనించలేదని, తన అభిమానిని క్షమించమని కోరడంతో” అక్షయ్ వ్యక్తిత్వాన్ని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. ఎంతటి సూపర్ స్టార్ అయినా, అభిమానులకు దాసోహమే కదా అన్న విషయం ఈ సంఘటన చెప్పకనే చెప్తోంది.
What happened that day was unfortunate and uncalled for. I was at the airport and I heard a commotion which… https://t.co/bkRW5CZJHx
— Akshay Kumar (@akshaykumar) April 29, 2016



