బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కు లండన్ విమానాశ్రయం (హీత్రూ) అధికారుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రోబో’ సీక్వెల్ ‘2.1’ షూటింగ్ ముగించుకున్న అక్షయ్, ‘రుస్తుం’ చిత్రం షూటింగ్ నిమిత్తం లండన్ బయలుదేరి, బుధవారం హీత్రూ విమానాశ్రయంలో దిగగా, అసలు “ఎంటర్టైన్మెంట్” ఇక్కడే మొదలైంది.
‘తమ దేశంలోకి అడుగుపెట్టాలంటే కావాల్సిన పత్రాలు సరిగా లేవంటూ అక్షయ్ కుమార్ ను దాదాపు గంటన్నర పాటు విమానాశ్రయంలోనే నిలిపివేశారు. సాధారణ ప్రయాణికులతో పాటే అక్షయ్ ని కూడా నిరీక్షించేలా చేసారు. దీంతో అభిమానులు ఆయన చుట్టుముట్టి ఆటోగ్రాఫ్ లు, సెల్ఫీల కోసం ఎగబడ్డారు. అనుకోని ఈ పరిణామాలతో ఇబ్బందిపడ్డ, అక్షయ్ తనను ప్రైవేట్ ప్లేస్ లో వెయిట్ చేసేందుకు అనుమతించాలని ఎయిర్ పోర్ట్ అధికారులను కోరినా ఫలితం లేకుండా పోయింది.
ADVERTISEMENT
ADVERTISEMENT





