ఛార్మినే కాదు, ముమైత్ కూడా పక్కా!

Drug Case Officer Akun Sabharwal Suddenly Goes on Leaveపూరీ, శ్యాం, సుబ్బరాజు, తరుణ్… ఇలా విజయవంతంగా కొనసాగుతున్న విచారణలో అసలు ట్విస్ట్ ఈ నెల 26, 27వ తేదీలలో జరగబోతుందంటూ జరుగుతున్న హంగామా తెలియనిది కాదు. 26న హీరోయిన్ ఛార్మి హాజరు కాబోతుండగా, 27న ముమైత్ ఖాన్ హాజరు కావాల్సి ఉంది. అయితే వీరిద్దరి విచారణపై అనేక సందేహాలు నెలకొన్నాయి. ఛార్మి విచారణ రెండవ రోజే ఉండాల్సి ఉండగా, ఆమె విజ్ఞప్తి మేరకు 26వ తేదీకి పోస్ట్ పోన్ చేసారు. అయినప్పటికీ ఆమె హాజరుపై అనేక సందేహాలు నెలకొన్నాయి.

ఛార్మి సంగతి ఇలా ఉంటే, ప్రస్తుతం బిగ్ బాస్ షోలో పార్టిసిపెంట్ గా ఉన్న ముమైత్ ఖాన్ ఎలా వస్తుందో అన్న సందేహం సర్వత్రా నెలకొంది. బిగ్ బాస్ కెమెరాల నుండే ఈ విచారణ జరగనుందని వార్తలు వెలువడుతున్న నేపధ్యంలో ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ అకున్ సబర్వాల్ కీలక ప్రకటన చేసారు. ఈ నెల 27వ తేదీన ఇదే ఆఫీస్ లో ముమైత్ హాజరు కానుందని, ఇప్పటికే వ్రాతపూర్వకంగా షో నిర్వాహకుల నుండి సమాచారం లభించిందని, అందులో ఎలాంటి సందేహం లేదని కుండబద్దలు కొట్టారు.

ADVERTISEMENT

అలాగే ఈ సందర్భంగా ఛార్మిపై వస్తున్న సందేహాలను తెరదించుతూ… 26వ తేదీన ఛార్మి ఖచ్చితంగా హాజరు కానుందని, ఇందులో మరో ఆలోచనకు తావు లేదని స్పష్టం చేసారు. దీంతో ఛార్మి, ముమైత్ ఖాన్ ల హాజరుపై నెలకొన్న సందేహాలు వీడిపోయాయి. వీరిద్దరి విచారణ తర్వాత ఈ కేసు కీలక మలుపు తీసుకోబోతుందన్న సంకేతాలు వ్యక్తమవుతున్నాయి. అయితే సిట్ అధికారుల విచారణలో ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు ఎలా సహకరిస్తారో చూడాలి?

ADVERTISEMENT
Latest Stories